విజయవాడ (ప్రజా అమరావతి);
*జులై 15న ఎన్ టి ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయ 24 మరియు 25వ వార్షిక స్నాతకోత్సవం నిర్వహణ..
-వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్ పింగళమ్..
డాక్టర్ ఎన్ టి ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ 24 మరియు 25వ వార్షిక స్నాత కోత్సవం ఈనెల 15న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్ పింగళమ్ తెలిపారు. విజయవాడ డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ కాన్ఫెరెన్స్ హాల్ లో బుధవారం విశ్వ విద్యాలయ 24, 25వ వార్షిక స్నాతకోత్సవ వివరాలను పాత్రికేయులకు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంప్రసాద్ పింగళమ్ మాట్లాడుతూ 2018వ సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న 24వ వార్షిక స్నాత కోత్సవంలో మొత్తం 67 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ 58, సిల్వర్ మెడల్స్ 21, నగదు బహుమతులు 23 అందించనున్నామని అయన తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో గుండె వైద్య పరిశోధనల్లో, వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించిన వైద్య నిపుణులు, తిరుపతి స్విమ్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. సుబ్రహ్మణ్యం కు ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ " గౌరవ డాక్టరేట్ " ను ప్రదానం చేయనున్నదని డాక్టర్ శ్యాంప్రసాద్ పింగళమ్ తెలిపారు.
2019 సంవత్సరంకు సంబంధించి నిర్వహిస్తున్న 25వ వార్షిక స్నాతకోత్సవంలో 60 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ 55, సిల్వర్ మెడల్స్ 18, నగదు బహుమతులు 24 అందించనున్నామని అయన తెలిపారు. వీటితో పాటు పి హెచ్ డి కోర్సు పూర్తి చేసిన ఐదుగురికి, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఒకరికి, గ్రాడ్యుయేషన్ డిగ్రీలు 73 మందికి ప్రదానం చేయనున్నారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్ పింగళమ్ తెలిపారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జులై 15వ తేదీన ఉదయం 11-30 గంటలకు నిర్వహించే 24వ, 25వ వార్షిక స్నాత కోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వ విద్యాలయ కులపతి శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షత వహిస్తారని తిరుపతి స్విమ్స్ ఉప కులపతి డాక్టర్ జి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొంటారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్ పింగళమ్ తెలిపారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. శంకర్, జాయింట్ రిజిస్ట్రార్ అజయ, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment