15వ రాష్ట్రపతి ఎన్నిక రెండు కారణాల వల్ల చరిత్రాత్మకం కానుంది


మంగళగిరి (ప్రజా అమరావతి);


*సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము*:


*సమావేశంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.విజయసాయిరెడ్డి*:


*శ్రీ వి.విజయసాయిరెడ్డి. వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి:*


– ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి «శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజుతో పాటు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ స్వాగతం.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి ద్రౌపది ముర్ముగారు ఢిల్లీలో నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు, ఆమెను సమర్థిస్తూ నాకూ, ఎంపీ మిధున్‌రెడ్డికి సంతకం చేసే అవకాశాన్ని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కల్పించారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ముర్ముగారు వ్యవహరించిన విధానం, ఒద్దిక, గౌరవంగా ప్రవర్తించిన తీరు దేశమంతా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మాత్రమే కాకుండా బీఎస్పీ, శిరోమణి అకాళీదళ్‌ పార్టీ, బిజూ జనతాదళ్‌ పార్టీలు కూడా ముర్ముగారి అభ్యర్థిత్వాన్ని సమర్థించాయి.

15వ రాష్ట్రపతి ఎన్నిక రెండు కారణాల వల్ల చరిత్రాత్మకం కానుంది


. తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళ ఈ పదవికి పోటీ చేస్తోంది. రెండో విషయం. ఒడిషాలోని రాయ్‌రంగపూర్‌లో కౌన్సిలర్‌గా పని చేసి ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు ఒక మహిళ. ముర్ముగారు కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, రాష్ట్రంలో ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ, ఆ తర్వాత జార్ఖండ్‌ గవర్నర్‌గా కూడా విశేష సేవలందించారు. ఇప్పుడు ఆ అనుభవంతో రాష్ట్రపతిగా కూడా రాణిస్తారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూరై్తన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సమయంలో ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కానుండడం గొప్ప విషయం.

రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయన ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి లక్ష్యాలుగా పని చేస్తున్నారు. రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వారి కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు.

మేమంతా ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నాం.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల అభ్యున్నతికి గత మూడేళ్లుగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన  మంత్రివర్గంలో 70 శాతం పదవులు వారికే ఇచ్చారు. అంతే కాకుండా వారికి ముఖ్యమైన శాఖలు కూడా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లల్లో మహిళలకు 50 శాతానికి పైగా పదవులు ఇచ్చారు. ఇది గతంలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి మాత్రమే చేసి చూపారు. 

రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి ముర్ము గురించి ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించినంతగా, మరెవ్వరం చెప్పలేము. శ్రీమతి ముర్ము గురించి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఏమన్నారంటే..

‘దేశ సేవ, నిరుపేదల అభ్యున్నతి కోసం శ్రీమతి ద్రౌపది ముర్ము తన జీవితాన్ని అంకితం చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారితో పాటు, పేదరికంలో ఉన్న వారు అభివృద్ధి చెందేలా ఎంతో కృషి చేశారు. ఆమెకు మంచి పరిపాలన దక్షత ఉంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మంచి అవగాహన ఉంది. అందుకే ఆమె రాష్ట్రపతి పదవిలో రాణిస్తుందని నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆమె ఒక గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారు. కచ్చితంగా నిలుస్తారు’..

మేడమ్‌ మీకున్న విశేష అనుభవం వల్ల రాష్ట్రపతిగా మీరు ఎంతో రాణిస్తారని మా అందరి ధృఢ విశ్వాసం. దేశంలోనే అత్యున్నతమైన ఆ పదవికి మీరు అన్ని విధాల అర్హులు. మేడమ్‌ మీ విజయం ఖాయం. మా అందరి పక్షాన మీకు అభినందనలు. మీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మా అందరి నమ్మకం. మీరు ఎంతో ఉజ్వలంగా బాధ్యతలు నిర్వర్తించి, ఒక గొప్ప రాష్ట్రపతిగా నిల్చిపోతారు. మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Comments
Popular posts
దొంగతనం కేసును చేదించి ముద్దాయిలను పట్టుకున్న రూరల్ సీఐ,. ఎస్ఐ
Image
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ, ఆధునిక సాంకేతిక పద్దతులు, పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది.
Image
Gudivada - Kankipadu road widening, development works start
Image
*ఊర పంది మాంసం ను, అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతున్న ముఠా అరెస్ట్* గోదావరిఖని : కొంత కాలంగా కొందరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఊర పంది మాంసంను అడవిలో తిరిగే జింక, దుప్పి, అడవి పంది మాంసంగా నమ్మిస్తూ, జింక, దుప్పి, అడవి పంది లను వెటాడి చంపినట్లుగా ఫోటోలను వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ ప్రజలను నమ్మించి, అదిక ధరలకు అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న వారిని గుర్తించి, వారిపైన నిఘా పెట్టి ఈరోజు శాంతినగర్, పెద్దపల్లి లో ఊర పంది మాంసంను అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతుండగా, *1) లోకిని అంజయ్య S/o ఎల్లయ్య, 37 సం, ఎరుకల r/o హన్మంతునిపేట్,* *2) రేవెల్లి సంపత్ S/o పీసరయ్య, 32 సం, ఎరుకల r/o వద్కాపూర్* అను ఇద్దరినిఅరెస్ట్ చేయడం జరిగినది. *ఇంకా వీరి ముఠా సభ్యులు అయిన* *1) లోకిని జంపయ్య r/o హన్మంతునిపేట్,* *2) లోకిని గణేష్ r/o హన్మంతునిపేట్,* *3) లోకిని అనిల్ r/o నిమ్మనపల్లి,* *4) రేవెల్లి శివాజీ r/o వడ్కపూర్,* *5) కుర్ర తిరుపతి r/o పెద్దకాల్వల* *6) కెదిరి తిరుపతి r/o పెద్దపల్లి* పరారిలో వున్నారు. వీరివద్దనుండి *1) 20 కిలోల ఊర పంది మాంసం* *2) 4 కత్తులు,* *3) మటన్ కొట్టె మొద్దుకర్ర* *4) తరాజు, బాట్లు* *5) AP-15-P-120 హీరో హోండా ప్యాషన్ మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకోనైనది.* ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన, ఏ.ప్రదీప్ కుమార్, సి ఐ. పెద్దపల్లి, కె.రాజేష్, ఎస్సై పెద్దపల్లి, కానిస్టేబుల్లు మాడిశెట్టి రమేష్, దుబాసి రమేష్ లను డి సి పి పెద్దపల్లి అభినందించారు.
Image
అవినీతి అనకొండగా మారిన దుర్గగుడి ఈవో • వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో రూ. 2 కోట్ల బిల్లులు • సీవేజ్ ప్లాంట్ పేరు చెప్పి రూ. 53 లక్షల దోపిడి • ఫుట్ పాత్ పేరు చెప్పి రూ. 10 లక్షల బిల్లు • నిత్య ఆదాయవనరుగా మారిన మహామండపం • ఈవో అక్రమాల్లో మంత్రి వెల్లంపల్లికీ భాగస్వామ్యం • అవినీతికి సహకరించలేదనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు • మీడియా సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ బెజవాడ కనక దుర్గమ్మ ఆలయం సాక్షిగా కోట్లది రూపాయిల అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వినియోగంలో ఉన్న లిఫ్టులను చూపి అడ్డంగా రూ. 2 కోట్ల 28 లక్షల రూపాయిలు దోచేశారని ఆరోపించారు. ఈవో సురేష్ బాబు గారు అవినీతి అనకొండలా తయారయ్యారనీ, ఆయన అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది కాబట్టే కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఈవోను కొనసాగిస్తున్నారనీ అన్నారు. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలోనే ఆదాయంలో రెండో అతిపెద్ద ఆలయం అయిన కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? గతంలో ఈవోలుగా పని చేసిన ఎంతో మంది ఐఎఎస్ అధికారులు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచారు. ప్రస్తుత ఈవో సురేష్ బాబు గారికి కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఎందుకు కొనసాగిస్తున్నారో మంత్రి గారికీ, దేవాదాయ శాఖ కమిషనర్ గారికే తెలియాలి. ఈవో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి బినామీగా మారారనీ, ఏ రోజు వాటా ఆ రోజు మంత్రి గారికి అందచేయడం వల్లే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. సురేష్ బాబు గారు ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. అమ్మవారి ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. కోట్లాది రూపాయిల పనులకు అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. కూతవేటు దూరంలో కమిషనర్ కార్యాలయం ఉన్నా పర్యవేక్షణ కరువయ్యింది. కోట్లాది రూపాయిలు చెల్లిస్తుంటే కనీస తనిఖీలు, ఆడిట్ లు ఎందుకు చేయడం లేదు. ఆలయ ప్రాంగణంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదు. ప్రతి విషయంలో ఈవోని వెనకేసుకుని రావడం, ఆయన చేసే అవినీతి పనులకు మద్దతు ఇవ్వడం చూస్తుంటే అందులో మంత్రి గారికి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావిస్తున్నారు. • రోడ్డు పక్క ఫుట్ పాత్ కి ఆలయానికీ సంబంధం ఏంటి? మే 26వ తేదీన మల్లిఖార్జున మహామండపంలో అడిషనల్ లిఫ్ట్ ఛాంబర్ కనస్ట్రక్షన్ పేరిట రూ. 2 కోట్ల 98 లక్షలు బిల్లులు డ్రా చేశారు. కరోనా లాక్ డౌన్ కొనసాగుతుంటే ఎవరూ చూడరు, స్పందించరని వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో కోట్లాది రూపాయిలు చెల్లించడం దోపిడి కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇందులో మీ భాగస్వామ్యం ఎంత? వినియోగంలో ఉన్న లిఫ్టులకు ఏరకంగా బిల్లులు చెల్లించారు? ఇంతకంటే అక్రమం ఏమైనా ఉంటుందా? కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున స్ట్రీట్ వరకు ఫుట్ పాత్ నిర్మాణం పేరిట రూ. 10 లక్షల 23 వేల బిల్లులు చెల్లించారు. అదీ మే 26నే చెల్లించారు. ఈ ఫుట్ పాత్ కీ కనకదుర్గమ్మ దేవస్థానానికీ సంబంధం ఏంటి? ఫుట్ పాత్ వేస్తే నగరపాలక సంస్థ వేయాలి. లేదా ఫ్లై ఓరవర్ నిర్మిస్తున్న హైవే ఆధారిటీ నిర్మించాలి. అన్ని బిల్లులు లాక్ డౌన్ సమయంలోనే చెల్లించడం వెనుక ఆంతర్యం ఏంటి? అమ్మవారి ఆదాయాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారు? • నాలుగేళ్లుగా మహా మండపాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు కమర్షియల్ కాంప్లెన్స్ ప్లేసులో రెండు మరుగుదొడ్లు కట్టి రూ. 64 వేలు బిల్లులు డ్రా చేశారు. ఏంటని అడిగితే సమాధానం చెప్పరు. అమ్మవారి సొమ్మును ఇంత బహిరంగంగా దోచుకుంటుంటే మంత్రిత్వశాఖ ఏం చేస్తోంది. ఆలయ మహామండపం నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మహా మండపం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. నిత్యం ఏదో ఒక పని అని చూపుతూ లక్షలాది రూపాయిలు అక్రమ బిల్లులు పెట్టి దోచుకుంటున్నారు. సీవేజ్ ప్లాంట్ పేరుతో బయటి నుంచి విరాళాలు సేకరించారు. అవి ఏమయ్యాయో తెలియదు. ప్లాంట్ పేరుతో రూ. 53 లక్షల 69 వేల బిల్లులు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పినవే రూ. 3 కోట్లు ఉన్నాయి. అమ్మవారి ఆదాయానికి ఇంత పెద్ద ఎత్తున గిండికొడుతుంటే అధికారులు, మంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఈవో సురేష్ బాబు గారి అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది అందుకే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారు. మేము ఉత్తుత్తి ఆరోపణలు చేయడం లేదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. వాస్తవాలను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. అమ్మవారి సొమ్ము కోట్లాది రూపాయిలు స్వాహా చేస్తున్నా మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు. దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కనీసం మానవత్వం చూపకుండా నిర్ధయగా తీసేశారు. కరోనా విపత్కాలంలో వారిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది. ఒక పక్కన ఆదాయం డబ్బులు లేవు అని చెబుతారు. కోట్లాది రూపాయిలు బిల్లులు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. అసలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తప్పేంటి? దశాబ్దకాలం 12 గంటలు నిబద్దతగా పని చేయడమే వారు చేసి తప్పా? మీరు చెప్పిన విధంగా అవినీతి పనులకు పాల్పడకపోవడం వల్లనే వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేసిన మాట వాస్తవం కాదా? ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టాం. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తాం అని చెబుతారు. మరి వీరి తొలగింపులో ఎందుకు జోక్యం చేసుకోరు. ప్రసాదం ప్యాకింగ్ కోసం రోజుకి రూ. 500 ఇచ్చి బయట నుంచి కార్మికుల్ని పెట్టుకుంటున్నారు. ఆ పని ఏదో వారితోనే చేయించుకోవచ్చు కదా? కొండ మీద కోర్టులు సైతం వద్దన్న ఒకరిద్దరు ఉద్యోగులను ఈవో గారికి సన్నిహితులు అన్న నెపంతో చిన్న ఆర్డర్ తో విధుల్లో కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో లడ్డూ ప్రసాదం విక్రయం అని చెప్పి వారిని అక్కడ విధుల్లో పెట్టడం వాస్తవం కాదా? విక్రయాలు నిలిపివేసిన తర్వాత కూడా విధుల్లో ఎలా కొనసాగిస్తున్నారు. మీ అవినీతిలో భాగస్వాములు అయ్యే వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారా? సెంట్రల్ నియోజకవర్గంలో కాశీవిశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన 900 గజాల విలువైన భూమిని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం వెనుక స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోత్సాహం ఉందన్న ప్రచారం జరుగుతుంటే స్వయానా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న శ్రీ మల్లాది విష్ణు గారు ఎందుకు దాన్ని ఖండించడం లేదు. అది అబద్దం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. దేవాలయ వ్యవస్థల్ని పరిరక్షించాల్సింది పోయి రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని శాశ్విత ఆదాయ వనరుగా మార్చుకునేందుకు మీరు చేస్తుంది కుట్ర కాదా? దీని మీద కూడా ఎవరూ స్పందించరు. మంత్రి పెద్ది రెడ్డి గారు జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో మీరు ప్రోత్సహిస్తుంది అభివృద్ధినా? అవినీతినా? దుర్గగుడి కేంద్రంగా జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? • హైకోర్టు తీర్పుని అమలుపర్చాలి దుర్గ గుడిలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పాలక మండలి ఏం చేస్తోంది. చైర్మన్ పైలా స్వామి నాయుడు గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు. మీకు ఈవో గారి అక్రమాల్లో భాగం ఉందా? అక్రమాలను అడ్డుకోలేని ఈ పాలక మండలి పనికి రాదు కోర్టు తీర్పుల అమలుపర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈవో సురేష్ బాబు గారు పనికి రారు అన్న హైకోర్టు తీర్పుని వెంటనే అమలుపర్చాలి అని అన్నారు.
Image