పొదలకూరు మండలంలో 150 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు

   

నెల్లూరు (ప్రజా అమరావతి);


సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలంలో  150 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు


చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, పొదలకూరు   మండలంలోని ఊచపల్లి, వావింటపర్తి  గ్రామాల్లో జరిగిన   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి  పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు  అపూర్వ  స్వాగతం పలికారు.


తొలుత మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి   ఊచపల్లి గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొని, ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు  అందుతున్నాయా లేదా  తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. 


ఈ సందర్భంగా  వైఎస్ఆర్ యంత్ర సేవా పధకం కింద సబ్సిడీ పై మంజూరైన  5.71 లక్షల రూపాయల విలువైన మినీ ట్రాక్టర్ ను,  69 వేల రూపాయల విలువైన రోటోవేటర్ ను కార్తికేయ సి.హెచ్.సి గ్రూపుకు  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి అందచేశారు. ఊచపల్లి గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను, 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సైడు కాలువలను మంత్రి ప్రారంభించారు.

 

ఈ సంధర్బంగా  ఏర్పాటు చేసిన సభలో మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలంలో  150 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ఊచపల్లి గ్రామంలో 4.40 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ప్రజలు  తమ సమస్యలు, పనుల నిమిత్తం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే వారని,  రాష్ట్ర ముఖ్యమంత్రి  సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో, నేడు   ప్రజల  ముంగిటకే అధికారులు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం  కార్యాక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నామని, వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేయడంతో పాటు, వారి అవసరాలను తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హతే ప్రామాణికంగా పేద  ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఊచపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 4.40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని,  ఈరోజు 60 లక్షల తో నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్లకు, 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సైడు కాలువలను ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈరోజు గ్రామంలోని ఒక కుటుంబం సిమెంట్ రోడ్డు కావాలని కోరటం జరిగిందని,  కనీసం 10 అడుగులు వుంటేనే సిమెంట్ రోడ్డు వేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ కుటుంబం కోరిన మీదట రోడ్డు నిర్మించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.  నెల్లూరు, సంగం బ్యారేజీ ల నిర్మాణం పూర్తి అయితే, సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని రైతులకు సాగునీటి కి ఇబ్బందులు ఉండవని మంత్రి తెలిపారు 


అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, వావింటపర్తి  గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు వివరిస్తూ, వారు లబ్ది పొందిన  సంక్షేమ పథకాల వివరాల బుక్ లెట్ ను అందచేశారు.

  

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు శ్రీమతి తెనాలి నిర్మలమ్మ, సర్పంచ్ శ్రీ ఎన్. కృష్ణమనాయుడు, ఎంపిడిఓ శ్రీమతి నగేష్ కుమారి, ఈఓపిఆర్డీ శ్రీ నరసింహులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Comments