2018 గ్రూప్ తుది ఫలితాలు విడుదల

 

విజయవాడ (ప్రజా అమరావతి);


2018 గ్రూప్ తుది ఫలితాలు విడుదల


* టాప్ టెన్ లో ఏడుగురు మహిళలు ఎంపిక.. 

* వచ్చే నెలలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల.. 

* రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జూలై 31న రాత పరీక్ష

* వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ 

2018 గ్రూప్ 1 తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఛైర్మన్ గౌతం సవాంగ్ విడుదల చేశారు. ఇంటర్వూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. ఫలితాల్లో.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన రాణి సుష్మితకు ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది. వైఎస్సార్‌ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులు రాజుకు రెండో ర్యాంక్‌, హైదరాబాద్‌కు చెందిన వి. సంజన సిన్హాకు మూడో ర్యాంక్‌ దక్కింది. మొదటి పది ర్యాంక్ లలో ఏడుగురు మహిళలు ఉండడం మహిళా సాధికారితను చూపుతుందని ఆయన తెలిపారు.  విజయవాడలో ఆర్ అండ్ బీ హెచ్ వోడీ బిల్డింగ్ సమావేశమందిరంలో మంగళవారం నాడు ఫలితాలు ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఫలితాలను ఎపీపీఎస్సీ వెబ్ సైట్లో పొందుపరిచారు.  ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా అండర్ టేకింగ్ లెటర్ పోస్టు ద్వారా గానీ, డైరెక్ట్ గా గానీ  ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.   

ఈ సందర్భంగా గౌతం సవాంగ్ మాట్లాడుతూ...  2018లో 167 గ్రూప్1 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ఎపీపీఎస్సీ నిర్వహించిందని, 167 గ్రూప్ 1 పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్ 30 పోస్టులు, డిఎస్పీ పోస్టులు 28 ఉన్నాయన్నారు. దీనిలో భాగంగా గ్రూప్ 1ఉద్యోగాలకు 67 మంది మహిళలు, 96మంది పురుష అభ్యర్థులు ఎంపియకయ్యారని తెలిపారు.  వివిధ కారణాలతో  4పోస్టులను భర్తీ చేయలేకపోయామన్నారు.  డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఎంపికైన వారిలో టాప్ లో నిలిచిన అభ్యర్థుల వివరాలు చైర్మన్  ప్రకటించారు.  డిప్యూటీకలెక్టర్ పోస్టుల్లో  టాప్ 1లో తూర్పు గౌదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత, టాప్ 2 లో వైఎస్ఆర్ జిల్లా కొతులగుట్టపల్లికి చెందిన కె. శ్రీనివాసులు రాజు, టాప్3లో హైదరాబాద్‍కు చెందిన సంజన సింహ నిలిచారని తెలిపారు. 2018 గ్రూప్ 1 కు సంబంధించి  అభ్యర్థులు డిసెంబర్ 2020లో 9679 మంది అభ్యర్ధులు గ్రూప్ 1 మెయిన్స్ హాజరయ్యారని తెలిపారు. గతంలో డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ చేసి 2021 ఏప్రిల్‍ 28న ఫలితాల ఏపీపీఎస్సీ విడుదల చేసిందని, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మాన్యువల్‍గా మళ్ళీ వాల్యుయేషన్ చేసి మేలో ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 165 గ్రూప్ 1 పోస్టుల ఖాళీల భర్తీ కోసం ఇంటర్వూలు పారదక్శకంగా పూర్తి చేశామన్నారు. మూడు ఇంటర్వ్యూ  బోర్డులు నియమించి గ్రూప్ -1 ఇంటర్వూల నిర్వహించామన్నారు. నాలుగేళ్ల పాటు జరిగిన నియామక ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేశామన్నారు. హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాల్ని తూచ తప్పకుండా అమలుచేశామని ఆయన తెలిపారు.. మెరుగైన విధానాల అవలంభన కొరకు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఉద్యోగాల జాతర : 

 అత్యంత పారదర్శకంగా, సమర్ధవంతంగా సాంకేతిక జోడించి పరీక్షలు నిర్వహిస్తున్నామని గౌతం సవాంగ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగంగా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నామని, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తుందని, యువత వారి కలలను నిజం చేసుకునేందుకు  ఏపీపీఎస్సీ అవకాశాలు కల్పింస్తుందన్నారు.  రాబోయే రోజుల్లో వరుస నోటిఫికేషన్లు ఉంటాయని.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించున్నామని తెలిపారు. అలాగే వచ్చే నెలలో గ్రూప్-1, గ్రూప్-2  ఉద్యోగాల నియామకానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని గౌతంసవాంగ్ వెల్లడించారు. వీటికి సంబంధించి 110పోస్టులతో  గ్రూప్-1, 182 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలకానున్నదని ఆయన అన్నారు. ఇఫ్పటికే 13 నోటిఫికేషన్లు విడుల చేశామని, వీటి ద్వారా ఆగస్టు, సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించి దాదాపు 2వేల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నామని తెలిపారు. దేవాదాయ శాఖలో ఈవో పోస్టులకు  జులై 24న, రెవెన్యూ శాఖలో 620 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జూలై 31న వ్రాత పరీక్ష  నిర్వహించనున్నట్లు గౌతంసవాంగ్ ప్రకటించారు.  

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కె. విజయ కుమార్, ప్రొఫెసర్ కె. పద్మ రాజు, డా. జీ.వీ. సుధాకర్ రెడ్డి, ఎస్. సలాం బాబు, ఏ.వీ. రమణా రెడ్డి, పి. సుధీర్, సోనూవుద్ నూతలపాటి, ఎన్. సుధాకర్ రెడ్డి, ఏపీపీఎస్సీ ఇంఛార్జ్ సెక్రటరీ హెచ్. అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 


Comments