జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆధ్వర్యంలో షార్టు ఫిలిమ్ కాంపిటీషన్-2022

 జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆధ్వర్యంలో షార్టు ఫిలిమ్ కాంపిటీషన్-2022

అమరావతి,11 జూలై (ప్రజా అమరావతి 9:న్యూఢిల్లీ లోని జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆధ్వర్యంలో షార్టు ఫిలిమ్ కాంపిటీషన్-2022 పోటీలను నిర్వహించడం జరుగుతోందని కర్నూల్ లోని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు.కావున ఆసక్తిగల వారు ఈషార్టు ఫిలిమ్ పోటీల్లో పాల్గొన వచ్చని ఈపోటీల్లో పాల్గొనే వారు వారి ఎంట్రీలను ఆన్లైన్ ద్వారా నేరుగా nhrcshortfilm@gmail.com కు గూగుల్ డ్రైవ్ ఫోల్డర్ లో పంపాల్సి ఉంటుందని తెలిపారు.ఈషార్టు ఫిలిమ్ పోటీలకు సంబంధించిన ఎంట్రీలను కర్నూల్ ఎపి హెఆర్సి కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు.జాతీయ మానవ హక్కుల కమీషన్ న్యూఢిల్లీ వారిచే నిర్వహించే ఈషార్టు ఫిలిమ్ పోటీలు-2022కు సంబంధించిన ఎంట్రీలను వచ్చే సెప్టెంబరు 15వ తేదీ 2022లోగా పైతెలిపిన మెయిల్ అడ్రస్ కు ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుందని తెలిపారు.

     

Comments