వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద ఇప్పటి వరకూ *రూ.6,685 కోట్లు* చెల్లించాం

 

వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద ఇప్పటి వరకూ *రూ.6,685 కోట్లు* చెల్లించాం


ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి నష్ట పరిహారాన్ని అందిస్తున్నాం

1075 కోట్ల రూ.లతో డ్రిప్ ఇరిగేషన్ పధకాన్నిపున:ప్రారంభించాం

ఆయిల్ ఫామ్ రైతులకు టన్నుకు 600రూ.లు వంతున అదనపు సాయం అందించాం

వర్షాలకు వరినార్లు దెబ్బతిన్న రైతులకు 85శాతం సబ్సిడీతో విత్తనాలు

రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కాకాని గోవర్ధనరెడ్డి

అమరావతి,13 జూలై (ప్రజా అమరావతి):రాష్ట్రంలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద ఇప్పటి వరకూ *రూ.6వేల 685 కోట్ల* రూ.లను చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధనరెడ్డి వెల్లడించారు.బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈప్రభుత్వం అధికారానికి వచ్చాక వ్యవసాయానికి ముఖ్యంగా రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి అనేక వినూత్న కార్యక్రమాలు,పధకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జడరుగుతోందని చెప్పారు.అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై బురదజల్లే లక్ష్యంతో ప్రతిపక్ష నేతలు కొన్నిమీడియా సంస్థలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు,విమర్శలు చేస్తున్నారన్నారు.సిసిఆర్సి కార్డు లేకపోయినా వైయస్సార్ బీమా పధకం కింద లక్ష రూ.లు సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి స్పష్టం చేశారు.వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద రైతులు చెల్లించాల్సిన వాటా,కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం నూరు శాతం ప్రభుత్వమే భరించి ఇప్పటి వరకూ *రూ.6,685కోట్ల* రూ.లను ఉచిత బీమా కింద చెల్లించామని చెప్పారు.

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి సకాలంలో నష్ట పరిహారం అందించడం జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకం,సిసిఆర్సి కార్డు ఉండి నష్ట పరిహారం అందలేదనే వారుంటే నిరూపించాలని ప్రతిపక్ష నేతలకు మంత్రి సవాల్ విసిరారు.గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5లక్షల రూ.లు వంతున నష్ట పరిహారాన్ని అందిస్తామని ప్రకటించి కేవలం లక్షన్నర రూ.లు మాత్రమే ఇచ్చి మిగతా మూడున్నర లక్షల రూ.లు తహసిల్ దార్ల వద్ద జాయింట్ అకౌంట్ లో ఉంచి దానిపై వచ్చే వడ్డీని వాడుకుని తర్వాత ఎప్పటికో ఆమిగతా మూడున్నర లక్షల రూ.లు ఇచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. కాని ఈప్రభుత్వం అధికారానికి వచ్చాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారాన్ని 7లక్షల రూ.లకు పెంచి సకాలంలో ఆనష్ట పరిహారాన్నిఅందించడం జరుగుతోందని మంత్రి గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు.

2014 నుండి 31 మే 2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను పున:పరిశీలన జరపగా వాస్తవమని తేలిన 471 మంది రైతు కుంటుంబాలకు 23కోట్ల 55 లక్షల రూ.లను నష్టపరిహారాన్నిఅందించామని వ్యవసాయశాఖామంత్రి కాకాని గోవర్ధనరెడ్డి చెప్పారు.అదే విధంగా 2019 జూన్ 1 నుండి 2019 డిశంబరు 31 వరకూ ఆత్మహత్య చేసుకున్న311 మంది రైతు కుటుంబాలకు 7లక్షల రూ.లు వంతున 21కోట్ల 77 లక్షల రూ.ల పరిహారాన్ని అందించామని చెప్పారు.2020లో 277 మందికి 19.39 కోట్లు,2021లో 211 మందికి 14.77 కోట్లు,2022లో ఇప్పటి వరకూ 51 మంది రైతు కుటుంబాలకు 3కోట్ల 57 లక్షల రూ.లు కలిపి ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ 1321 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న కుంటుంబాలకు 83కోట్ల 5లక్షల రూ.లను నష్ట పరిహారంగా అందించినట్టు మంత్రి గోవర్ధన రెడ్డి వెల్లడించారు.గత ప్రభుత్వ కాలంలో కరువు,రైతు ఆత్మహత్యలు సర్వసాధారణం కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు సకాలంలో పడుతుండగా ఇప్పటి వరకూ ఒక్క కరువు మండలాన్నికూడా ప్రకటించలేనది మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 800 కోట్ల రూ.లు బకాయిలు పెట్టివెళ్ళిపోయిందని ఈప్రభుత్వం వచ్చాక 1075కోట్ల రూ.లతో ఈపధకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని వ్యవసాయ శాఖామంత్రి కాకాని కోగవర్ధన రెడ్డి వెల్లడించారు.అదే విధంగా ఆయిల్ ఫామ్ రైతులకు 85కోట్ల రూ.లు వెచ్చించి టన్నుకు 600 రూ.లు వంతున అదనపు సాయం అందించడం ద్వారా వారిని అన్నివిధాలా ఆదుకుంటున్నట్టు చెప్పారు.

వర్షాల నష్టం అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది-సకాలంలో 85శాతం సబ్సిడీతో వరి విత్తనాలు

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకూ అందిన ప్రాధమిక నివేదిక ప్రకారం 1800 ఎకరాల్లో వరినారు(నారుమడులు)దెబ్బతిన్నట్టు తెలుస్తోందని నష్టం అంచనా ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి మీడియాకు వివరించారు.వరినారు(నర్సరీ)దెబ్బతిన్న రైతులకు 85శాతం సబ్సిడీతో వరి విత్తనాలను త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.అదే విధంగా ఇతర పంటలు దెబ్బతింటే గతంలో అవలంభించిన విధానాల ప్రకారం సీజన్ ముగిసే లోగా తగిన పంటనష్ట పరిహారాన్ని రైతాంగానికి అందించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

    

Comments