శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):
దేవస్థానం నందు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ త్రయోదశి , సోమవారము నుండి ఆషాఢ పౌర్ణమి, బుధ వారము వరకు అనగా ది.11.07.2022 నుండి ది.13.07.2022 వరకు శాకంబరీ ఉత్సవములను అత్యంత వైభవముగా నిర్వహించబడును.
కార్యక్రమముల వివరములు :
ది.11.07.2022, సోమవారము :
- ఉ.గం.07.30 లకు విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరుణ,
పుణ్యాహ వచనము, అఖండ దీపారాధన,అంకురార్పణ.
- సా.గం.04-00లకు కలశస్థాపన,అగ్నిప్రతిష్టాపన,మండపారాధన
హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ.
ది.12.07.2022,మంగళవారము:
- ఉ.గం.08.00 లకు సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణము మరియు హోమములు.
- సా.గం.04-00లకు మూల మంత్రహవనములు, మండప పూజ,
హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ.
ది.13.07.2022, బుధవారము:
- ఉ.గం.08.00 లకు సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణము మరియు హోమము, శాంతి పౌష్టిక హోమములు, మంటప పూజ అనంతరం ఉ.గం.10-00 లకుమహా పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనము, ప్రసాద వితరణ, ఉత్సవ సమాప్తి.
ది.11-07-2022 నుండి ది.13-07-2022 వరకు శ్రీ అమ్మవారి మూల స్వరూపమునకు శాకంబరీ దేవిగా ప్రత్యేక అలంకరణ ( పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో)..
ది.11-07-2022 నుండి ది.13-07-2022 వరకు మూడు రోజులు భక్తులు అందరికీ కదంబం ప్రసాదమును ప్రత్యేకముగా చేయించి పంచిపెట్టబడును
శ్రీ అమ్మవారి సేవలో..
దర్భముళ్ళ భ్రమరాంబ,
ఆలయ కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment