శాసన సభ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

 *శాసన సభ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు


*

*•ఘనంగా నివాళులు అర్పించిన శాససభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు*

అమరావతి, జూలై 4 (ప్రజా అమరావతి): విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. శాసన సభ కమిటీ సమావేశ మందిరంలో శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది అంతా సమావేశమై మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సందర్బంగా శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. తన  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విదేశీయుల పాలన నుండి దేశాన్ని విముక్తిచేసేందుకు దేశానికి స్యాతంత్ర్యాన్ని సాదించేందుకు కేవలం విల్లంబులు, భాణాలతో బ్రిటీష్ పాలకులను ఎదిరించి గొప్పదేశభక్తుడని కొనియాడారు. 

రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శులు కె.రాజకుమార్, ఎం.విజయరాజు, వనితారాణి, చీఫ్ మార్షల్ థియో ఫిలాస్ తదితరులతో పాటు శాసన సభ విభాగం అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 


Comments