ఏపీ సచివాలయం (ప్రజా అమరావతి);
*దేశానికి సంస్కృతిని నేర్పించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
*
*సంస్కృతి సాంప్రదాయాలకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు..*
*అన్ని రంగాల్లో నిష్ట్నాతులైన కళాకారులని గుర్తిస్తాం.*
...*మంత్రి ఆర్.కే. రోజా..*..
*గురువారం ఏపీ సచివాలయంలో సాంస్కృతిక శాఖా అధికారులతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి మంత్రి అర్. కే. రోజా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.*
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అని, రాష్ట్రం లో అన్ని రంగాల్లో ఉన్న కళా కారులను గుర్తించి, వారిని , కళలను ప్రోత్సహిస్తాం అని మంత్రి రోజా తెలిపారు.
రాష్ట్రంలో అధికారికంగా సాంస్కృతిక పోటీలను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని మరియు గెలుపొందిన జట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డులు అందిస్తామని మంత్రి రోజా తెలిపారు.
జిల్లాల వారీగా కళాకారుల గుర్తింపు మరియు స్థానిక కళాకారుల సహాయంతో జరగాలనీ, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలనీ మంత్రి అధికారులకు ఆదేశించారు.
కళాకారులకు ఐడి కార్డుల జారీకి వార్డు & గ్రామ సచివాలయాల సేవలను వినియోగించుకావాలని,
భవిష్యత్ తరాలకు సేవ చేయడానికి తెలుగు కళారూపాలను పరిరక్షించడానికి & ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలు తప్పనిసరిగా భాగం కావాలనీ మంత్రి అధికారులని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రస్తుత ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ చెల్లింపులను పరిశీలించడం,
జిల్లాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం, అన్ని జిల్లాల్లోని ఆడిటోరియంల గుర్తింపు, అన్ని కళారూపాల ఛాయాచిత్రాల ఏర్పాటు, జిల్లాల వారీగా అన్ని కళారూపాలను గుర్తించి జాబితా చేయడం, జిల్లా సాంస్కృతిక మండలి కమిటీని పునర్నిర్మించడం, అర్హులైన కళాకారులందరికీ అవసరమైన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని నిర్ధారించుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియంలను అందించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు & సంబంధిత అధికారులకు లేఖలు పంపడం, శిల్పారామం, దేవాలయాలు మరియు ఇతర ప్రభుత్వ భవనాల వనరులను (ఆడిటోరియంలు) సాంస్కృతిక కార్యక్రమాల కోసం (వాటి కార్యకలాపాలకు భంగం కలిగించకుండా) వినియోగించుకోవడం, ఈ కార్యక్రమంలో చైర్మన్/ఛైర్పర్సన్లందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నారు.
సమీక్ష సమావేశం లో సాంస్కృతిక చైర్మన్ లు, డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఐఏఎస్, సీఈఓ కల్చరల్ శ్రీ మల్లికార్జున, ఐఏఎస్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment