ఎంపీలు, మంత్రితో సమావేశమైన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి



*ఎంపీలు, మంత్రితో సమావేశమైన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి*


*ఇటీవల ఏపీఐఐసీ నిర్వహిస్తోన్న "ఐఈఐడీని" ప్రశంసించిన ఎంపీలు*


అమరావతి, జూలై, 06 (ప్రజా అమరావతి) : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి బిజీబిజీగా గడిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, అనంతపురం ఎంపీ తలారీ రంగయ్య, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావుతో వరుసగా సమావేశమయ్యారు. మంగళగిరి కార్యాలయానికి వచ్చిన ఎంపీలతో ఏపీఐఐసీ కార్యక్రమాలపై ఛైర్మన్ చర్చించారు. ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ కార్యక్రమాన్ని ఏపీఐఐసీ నిర్వహిస్తోన్న తీరును ఎంపీలు ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావును ఆయన క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ కలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8,9 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న  ప్లీనరీ సమావేశాలు సహా ఏపీఐఐసీ చేపడుతున్న కార్యక్రమాలపై వారివురు కాసేపు మాట్లాడుకున్నారు.


Comments