గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ రేపు ఏరియల్‌ సర్వే.*రేపు (15_07_2022) మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఏరియల్‌ సర్వే*


*ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు*


*గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు*

*ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్న సీఎం*

*ఇరిగేషన్‌ రివ్యూ సందర్భంగా సీఎం ఆదేశాలు*


అమరావతి (ప్రజా అమరావతి):

– గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ రేపు ఏరియల్‌ సర్వే.

– ఏరియల్‌ సర్వేకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.

– ఉదయం గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

– రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో తెలిపిన అధికారులు.

– తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించిన అధికారులు. 

– దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.

– ఆమేరకు పోలవరం వద్దా, ధవళేశ్వరం వద్దా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశం. 

– వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం.

– వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం.

– ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలన్న సీఎం.

Comments