ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ది చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి


నెల్లూరు (ప్రజా అమరావతి);రామాయపట్నం పోర్టు నిర్మాణం వలన ఈ ప్రాంతం  పారిశ్రామికంగా ఎంతగానో  అభివృద్ది చెంది  ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. 


బుధవారం ఉదయం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం, మొండివారిపాలెం వద్ద రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్మోహన్  రెడ్డి భూమిపూజ చేశారు.  ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రామాయపట్నం పోర్టుకు ఈరోజు భూమిపూజ  జరుగుతున్న నేపధ్యంలో.. ఒక పోర్టు రావడంవల్ల  జరిగే మంచి ఏమిటన్నది మనలో చాలామందికి తెలుసు. 

పోర్టుల వల్లే మహానగరాలు...

అటువైపు చెన్నై, ఇటువైపు విశాఖపట్నం, మరోవైపు ముంబాయి


ఇలా ఏ నగరమైనా పెద్ద నగరంగా, మహానగరంగా ఎదగాయంటే.. అక్కడ పోర్టు ఉండడమే. దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించవచ్చు.  పోర్టు రావడం వల్ల ఉదోగ అవకాశాలు చాలా పెరుగుతాయి. పోర్టు రావడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయి.  పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు తగ్గిపోతాయి. నీటి రవాణా చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారమని, తద్వారా రాష్ట్రానికే కాకుండా.. ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారతాయి అని అన్నారు. 

75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే...

రాష్ట్రంలో ఒక చట్టాన్నే తీసుకొచ్చాం. ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీని ఆధారంగా పోర్టులు కానీ, దీనికి  అనుసంధానంగా వచ్చిన పరిశ్రమలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే  అన్ని పరిశ్రమలు కూడా స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఆటోమేటిక్‌గా ఉంటుంది.  కాబట్టి ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. ఈ రాష్ట్రానికి కూడా ఊతం వస్తుంది. 

గతంలో మన పోర్టుల పరిస్థితి.... రాష్ట్రంలో   మన పరిస్థితి ఏమిటి అని గమనిస్తే.. మన దగ్గర దాదాపు 6 పోర్టులు ఉన్నాయి. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం, తదితర  ప్రాంతాల్లో ఉన్నాయి.  వీటిలో విశాఖపట్నం కాకుండా మిగిలిన పోర్టులు కెపాసిటి 158 మిలియన్‌ టన్నులు ఉంటే.. విశాఖపట్నం పోర్టు మరో 70 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. 


మన హయాంలో కొత్తగా 4 పోర్టులు– 9 ఫిషింగ్‌ హార్భర్లు.

స్వాతంత్య్రం వచ్చినప్పుటి నుంచి ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం.  అంటే ఈ 5 సంవత్సరాలలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నంలు రానున్నాయి.  వీటి ద్వారా మరో 100 మిలియన్న టన్నుల కెపాసిటీకి కూడా వస్తోంది.  ఈ నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్‌లు కూడా వేగవంతంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్పలతో  పాటు మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నంతో పాటు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌లు నిర్మాణం జరుపుకుంటున్నాయి. మరో రెండు నెలల్లో మిగిలిన పోర్టులకు సంబధించిన నిర్మాణపనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయి. మరో రెండు నెలల తిరక్క మునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమిపూజ చేసుకునే దిశగా పనులు వేగవంతం అవుతున్నాయి. ఇలా 4 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్భర్లు రానున్నాయి.

లక్ష మంది గంగపుత్రులకు మన రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధి...

 మన దగ్గర ఉన్న 6 పోర్టులను గమనిస్తే.. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక షిషింగ్‌ హార్భర్‌ కానీ, పోర్టు కానీ కనిపించే పరిస్థితుల్లోకి రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. 9 ఫిషింగ్‌ హార్భర్లు పూర్తి అయితే.. వీటి ద్వారా 1లక్ష మంది మత్స్యకార కుటుంబాలు ఉద్యోగ, ఉఫాధి అవకాశాలకు గుజరాత్‌ వంటి ప్రాంతాలకో,వేరెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మనం ఇవాళ మాట్లాడుకుంటున్న నాలుగు పోర్టులు కాకినాడ ,మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం ద్వారా కూడా ఒక్కోక్క పోర్టులో నేరుగా కనీసం 3–4 వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పరోక్షంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నాం. రూ.3700 కోట్లతో రామాయపట్నం పోర్టు పనుల  కోసం 850ఎకరాల భూమి కూడా పూర్తిగా సేకరించి... రూ.3700 కోట్లతో పనులు కూడా మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది. పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మరో 6 బెర్తులు కూడా ఇదే ఇన్‌ఫ్రాస్చ్రక్టర్‌లోనే వచ్చే అవకాశాలున్నాయి. ఒక్కోదానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ 4 బెర్తుల ద్వారా 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేసే సామర్ధ్యం లభిస్తే... మరో రూ.1200 కోట్లు మనం ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు పెట్టుబడి పెడితే... ఏకంగా 50 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేయవచ్చు.

సహకరించిన వారికి కృతజ్ఞతలు...

పోర్టు వల్ల మంచి జరగాలని దేవుడిని మనసారా కోరుకుంటూ.. ఈ ప్రాంతంలో పోర్టు రావడానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం కాకుండా రావూరు, చేవూరు, సాలిపేట గ్రామస్ధులందరికీ నిండుమనస్సుతో చేతులు జోడించి పేరు, పేరునా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు మన భూమిలిచ్చి.. పోర్టు రావడానికి మనం వేసిన అడుగులు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖంచబడతాయి. 

కారణం  రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. మన పిల్లలందరూ ఎక్కడికెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెదుక్కునే అవకాశం లేకుండా.. మన గ్రామాల నుంచి పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌  అన్నారు. మంచి పోర్టు వచ్చి ఇక్కడ పరిస్థితులు మారుతున్నప్పుడు.. కందుకూరు పట్టణం పెద్ద హబ్‌గా తయారవుతుందని, అటువంటి పరిస్థితుల్లో రోడ్లకు సంబంధించి కందుకూరు బైపాస్‌ రోడ్డు భూసేకరణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే  కందుకూరు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం కూడా నా వంతు సహాయ,సహకారాలు అందిస్తాను. అదే విధంగా రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణకు సంబంధించి 8,500 ఎకరాలకు నీళ్లందించే పనులకోసం మరో రూ.27 కోట్లు కావాలన్నారు. ఆ నిధులు కూడా మంజూరు చేస్తున్నాం. ఉలవపాడు మండలంలోని కారేడులో పీహెచ్‌సీ శాశ్వతభవనం అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. ఈ ప్రాంతానికి మంచి జరగాలని.. ఈ పోర్టు  నిర్మాణంతో ఇక్కడ రూపురేఖలు పూర్తిగా మారే పరిస్థితి రావాలని...మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో మీకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖా మంత్రి శ్రీ గుడివాడ  అమర్నాథ్ మాట్లాడుతూ, ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు, భారతదేశంలో తూర్పువైపున అత్యంత పెద్ద సముద్రతీరం కల్గిన రాష్ట్రం మన ఏపి. దేశంలోనే రెండో అతి పెద్ద సముద్రతీరం కల్గిన రాష్ట్రం మనది. ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి, పోర్టుల నిర్మాణం, పిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టాలి, మనకు ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వినియోగించుకుని తద్వారా రాష్ట్రానికి ఆర్ధిక పురోగతి తీసుకురావాలని సీఎం గారు మ్యారిటైమ్‌ బోర్డు ద్వారా రూ. 15 వేల కోట్లు ఖర్చుపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ మనకున్న వనరులు ఏ రకంగా వినియోగించుకోవాలని ఆలోచించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  మాత్రమే. రామాయపట్నం పోర్టుతో పాటు, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, 9 పిషింగ్‌ హార్బర్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న 6 ఆపరేషనల్‌ పోర్టులు కానీ ఇవన్నీ కలిపి పూర్తిస్ధాయిలో అభివృద్ది జరగాలని సీఎంగారి ఆలోచనా విధానానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఏ రోజు కూడా సీఎం గారు ఏం చేయాలన్నా ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులతో ముందుకెళతారు. కానీ చంద్రబాబు మాత్రం శంకుస్ధాపన ఎక్కడ చేశారు, 2019 లో ఎన్నికలకు రెండు నెలల ముందు హడావిడిగా శంకుస్ధాపన చేసి నేనే చేశానంటున్నారు, కనీసం ఒక్క అనుమతైనా ఉందా అప్పుడు, చంద్రబాబుకు ఒక అలవాటు, ఆయనతో పాటు ఒక తాపీ మేస్త్రిని, నాలుగు ఇటుకలు తీసుకువెళ్ళి ఎక్కడ కనబడితే అక్కడ శంకుస్ధాపనలు చేస్తారు, ఆయన వేసింది పునాదిరాళ్ళు కాదు, సమాధిరాళ్ళు. ఈ రామాయపట్నం పోర్టును మళ్ళీ ప్రారంభించేది శ్రీ జగన్‌ గారే, ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. పారిశ్రామిక అభివృద్దిలో కూడా రాష్ట్రం పరుగులు తీస్తుందని తెలిపారు. 


రాష్ట్ర  పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ ఆర్. కరికల్ వలవన్ మాట్లాడుతూ,  ఏ ప్రాంతమైన అభివృద్ది సాధించాలంటే,  మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ది చెందినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుందని, అందులో భాగంగా నేడు రాష్ట్రంలో  నాలుగు పోర్టులు, 9 ఫిషింగ్ హర్బర్స్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు.  రామాయపట్నం పోర్టు నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందుతుందని అని అన్నారు.  ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సుదీర్గమైన సముద్ర తీర ప్రాంతం వుందని,   సముద్ర తీర ప్రాంత వనరులను సద్వినియోగం చేసుకొని రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందడానికి పోర్టుల నిర్మాణాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో  రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా  రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, పరిశ్రమల మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి నిర్మాణాలను చేపట్టడం జరుగుచున్నదని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో దగదర్తి ఎయిర్ పోర్టు కూడా రానున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఈ రోజు  నెల్లూరు జిల్లా, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజని,  మన జిల్లాలో  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టును అందచేస్తే,   వారి తనయులు  ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టుకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు.  ప్రకృతి అందించిన సహజ వనరులను  సమాజ శ్రేయస్సు కోసం  ఆభివృద్ధి వనరులుగా మారుస్తూ ఈ ప్రాంత అభివృద్దికి సుస్థిర వనరులుగా రామాయపట్నం పోర్టును అభివృద్ది చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  మొదటి దశలో 3736 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్టును అభివృద్ది చేయడం వలన ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 25 వేల మంది స్థానికులకు ఉపాధి కలుగుతుందని, దీని వలన ఈ ప్రాంతం సమగ్రాభివృద్దికి తోడ్పడుతుందని  కలెక్టర్ తెలిపారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 850 ఎకరాల భూమిని అందించిన ఈ ప్రాంత రైతులకు జిల్లా కలెక్టర్ ఈ సంధర్బంగా కృతజ్ఞతలను తెలియచేశారు. భూసేకరణ దాదాపు పూర్తి కావడం జరిగింది, అలాగే ఈ ప్రాంతానికి   సంబందించి మొండివారిపాలెం, ఆవులవారి పాలెం, కర్లపాలెం,  శాలిపేట  గ్రామాలకు చెందిన 691 కుటుంబాల వారు తమ భూమిని ఇవ్వడం జరిగిందని,  వీరికి ఆర్.ఆర్ ప్యాకేజీని ని అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ, బైపాస్‌ రోడ్డు కోసం 6.2 కిలోమీటర్ల భూసేకరణ చేయాలని, అలాగే, కందుకూరు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం నిధులు అవసరమని, అదే విధంగా రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణకు సంబంధించి 8,500 ఎకరాలకు నీళ్లందించే పనులకోసం మరో రూ.27 కోట్లు కావాలని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 


 కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ,  ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక  కారిడార్‌ కూడా వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి కనపిస్తుందని చెప్పారు. పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి అన్నారు. కావలి నియోజకవర్గం పక్కనే ఉంది.. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నెలకొల్పాలని అడిగారు. అది మంచి ఆలోచనే. రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తామని  ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. 


సుజాత, మొండివారిపాలెం గ్రామస్తులు:

అన్నా పోర్టు అనేది మాకు ఒక కల, ఎప్పటినుంచో పోర్టు వస్తుందన్నారు కానీ రాలేదు. ఇప్పుడు పోర్టు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్ధానికులకు చదువుకున్నా ఉద్యోగావకాశాలు లేవు, కానీ మీరు 70 శాతం స్ధానికులకే ఉద్యోగావకాశాలు ఇస్తామన్నారు, సంతోషం...పోర్టుకు మా భూమి ఒక ఎకరా ఇచ్చాం, దానికి రూ. 15 లక్షలు ఇచ్చారు, ఆ డబ్బును మా కుటుంబాన్ని మెరుగుచేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాం. మీకు ఎంతో రుణపడి ఉంటామన్నా, మేమంతా మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్ళం, మాకు వేట నిషేద సమయంలో మీరు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తున్నారు, గతంలో రూ. 4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అప్పుడు పాదయాత్రలో చెప్పినట్లుగా మా సంఘానికి వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా సాయం అందింది, చాలా సంతోషంగా ఉంది, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. మా ఇంట్లోవారు గతంలో ఫించన్‌ల కోసం తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంటికే తెస్తున్నారు, నాకు అమ్మ ఒడి వస్తుంది, మా పాప కూడా నాకు జగన్‌ మామయ్య అమ్మ ఒడి ఇస్తున్నారని సంతోషంగా చెబుతుంది. మేమంతా దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకున్నాం, మాకు ఒక అన్నగా మీరు అండగా ఉన్నారు. మా ఊరికి మీరు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మీరే పదికాలాల పాటు సీఎంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


ఆవల జయరామ్, ఉలవపాడు మండలం గ్రామస్తులు:ఈ రోజు ఈ ప్రాంతానికి పండుగ, మన ప్రాంతానికి వచ్చి పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన జగనన్నకు మత్స్యకారుల తరపున ధన్యవాదాలు. జగనన్న తన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, మన మత్స్యకారులకు మత్స్యకార భరోసా హామీ ఇచ్చారు, మన కష్టార్జితం గుర్తించి మనకు అన్నీ అందేలా చేస్తున్నారు. గతంలో డీజిల్‌ సబ్సిడీ ఎప్పుడిచ్చేవారో తెలీదు కానీ ఇప్పుడు జగనన్న స్పాట్‌లోనే సబ్సిడీ ఇస్తున్నారు. వేట సమయంలో మరణిస్తే గతంలో రూ. 5 లక్షలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు జగనన్న రూ. 10 లక్షలకు పెంచారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ అన్నారు కానీ ఎవరూ చేయలేదు, జగనన్న మాత్రం శరవేగంగా నిర్మాణం చేపట్టారు, రామాయపట్నం పోర్టు గురించి జగనన్న పాదయాత్రలో చెప్పిన మాటకు కట్టుబడి మన పోర్టు భూమి పూజకు వచ్చారు. మత్స్యకార కుటుంబాలలో చిన్న చిన్న ఆక్వారైతులు ఉన్నారు, వారి కష్టాలు గుర్తించి యూనిట్‌ రూపాయిన్నరకి తగ్గించారు. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి మాకు అన్ని పథకాలు అందజేస్తున్నారు. ధ్యాంక్యూ సార్‌.అనంతరం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి, 5 మంది నిర్వాసితులకు పక్క ఇళ్ల పట్టాలు అందచేశారు. 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు,  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి,  రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ బీదా మస్తాన్ రావు,  నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు  శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శ్రీ తూమాటి మాధవ రావు, శ్రీ వాకాటి నారాయణ రెడ్డి,  కోవూరు,  నెల్లూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కనిగిరి  శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,   శ్రీ అనిల్ కుమార్, శ్రీ మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీ  మేకపాటి విక్రమ్ రెడ్డి, శ్రీ బుర్రా మధు సూదన్ యాదవ్, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకా నాధ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి,  ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జవహర్ రెడ్డి , ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ సి.ఈ.ఓ శ్రీ షన్మోహన్,  డి ఐ జి శ్రీ త్రివిక్రమ్ వర్మ , జిల్లా ఎస్ పి శ్రీ విజయా రావు,  నెల్లూరు జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మ నాథ్, నెల్లూరు నగర కమీషనర్ జాహ్నవి,  రామాయపట్నం పోర్టు అధారిటీ యం.డి ప్రతాప్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు. 


Comments