నెల్లూరు, జులై 31 (ప్రజా అమరావతి):- జిల్లాలో ఆగస్టు 1 నుండి 15వ తేదీ వరకు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవం - హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ విరివిగా పాల్గొని విజయవంతం చేయాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజల్లో దేశభక్తి భావం, జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించడానికి కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రంలో
రెండు జిల్లాలు ఎంపిక కాగా అందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉండటం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయపతాకంతో సెల్ఫీలు దిగడం తో పాటు దేశభక్తిని పెంపొందించే విధంగా సదస్సులు, బృంద చర్చలు, వ్యాసరచనలు, క్విజ్ నాటకాలు ,సంగీతము చిత్రలేఖనం వంటి కళాత్మక రంగాల్లో పోటీలు ర్యాలీలు వారసత్వ నడక నిర్వహించడం వివిధ రకాల గోడపత్రాలు కరపత్రాలు ఇతర ప్రచార సామాగ్రిని విస్తృతంగా వినియోగిస్తామన్నారు. ఆగస్టు 1వ తేదీన అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ర్యాలీలు నిర్వహించి, ఇంటింటికి తిరిగి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తారన్నారు. ఆగస్టు 2 వతేదీన స్వాతంత్ర సమర యోధులు జాతీయ పతాకం రూపకర్త శ్రీపింగళి వెంకయ్య, శ్రీ బళ్లారి రాఘవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామన్నారు. ఆగస్టు 3 వ తేదీన శ్రీ కాకాని వెంకటరత్నం జయంతి ఉత్సవాలతో పాటు వెలుగులోకి రాని స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విద్యాసంస్థల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 4వ తేదీన దేశభక్తి గీతాలపై పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 5వ తేదీన దేశభక్తి ప్రతిబింబించే విధంగా నాటకాలు ఏకపాత్రాభినయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆగస్టు 6వ తేదీన దేశభక్తి భావం ప్రతిబింబించే విధంగా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 7వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 8 వ తేదీన చిత్రలేఖనం, వక్తృత్వం, చర్చలు, గోడపత్రాల తయారీ జింగిల్స్ పెయింటింగ్ వంటి రంగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 9వ తేదీన దేశభక్తిని ప్రబోధించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 10వ తేదీన శ్రీ వివి గిరి జయంతి ఉత్సవాలను హారతులను,సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 11వ తేదీన వారసత్వ నడకను, 12వ తేదీన క్రీడల పోటీలను, 13వ తేదీన జాతీయ పతాకంతో సెల్ఫీలను, 14వ తేదీన స్వాతంత్ర సమరయోధుల గృహాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకంతో పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఆగస్టు నెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, చారిత్రాత్మక కట్టడాలు వంటి ముఖ్యమైన ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్మికులచే స్వచ్చాగ్రహ కార్యక్రమం చేపట్టి అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలో ఈ కార్యక్రమాలు జిల్లా పరిషత్తు, కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం, శ్రీ వెంకటేశ్వర కస్తూరిబాకళాక్షేత్రం లలో నిర్వహిస్తామన్నారు. ఏరోజుకారోజు అధికారులు వారు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను హర్ ఘర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
addComments
Post a Comment