ఆంధ్ర అమితాబ్ ను సత్కరించిన మహానటి సావిత్రి కళాపీఠం
విజయవాడ ,జులై 16 (ప్రజా అమరావతి):
చిత్ర పరిశ్రమలో ఆంధ్ర అమితాబ్ గా పేరెన్నికగన్న డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గోపీని మహానటి సావిత్రి కళాపీఠం ఘనంగా సత్కరించింది. ఇటీవల సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి పురష్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన లఘు చిత్ర పోటీలలో వీరు డైరెక్ట్ చేసిన సురవరం ప్రతాప రెడ్డి రచించిన "గ్యారా కద్దూ బార కొత్వాల్" కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన 30 నిమిషాల నిడివిగల సినిమా కి గాను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రంగా బహుమతి అందుకున్న సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీని ఈ మేరకు మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం నిర్వాహకులు వడ్డి దుర్గాప్రసాద్, బండ్రెడ్డి కిషోర్ కుమార్, కోసూరి మాధవ కృష్ణ ,హరి మోహన్, బడే ప్రభాకర్, టీవీ రంగారావు, నెల్లూరు నాయబ్ లు శాలువాతో సత్కరించి సంఘ జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు గోపి మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కాంపిటీషన్లో సురవరం ప్రతాపరెడ్డి రచనల్లోని గ్యార కద్దు భార కోత్వాల్ రచనను ఆధారంగా చేసుకుని గంటల వ్యవధిలో నిర్మించిన 30 నిమిషాల నిడివిగల లఘు చిత్రానికి ప్రభుత్వం నుంచి ప్రథమ బహుమతి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి ఖర్చు పెట్టిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడం విశేషమన్నారు. ప్రముఖ సినీ, టీవీ నటులు లోహిత్ కుమార్ నిర్మించి, ముఖ్య పాత్రలో నటించారని, అంతే కాకుండా ఈ చిత్రంలోని 30 మంది పాత్రలకు తాను వాయిస్ అనుకరుణ చేస్తూ డబ్బింగ్ చెప్పడం ప్రశంసనీయమన్నారు.ఈ చిత్రానికి డీఓపీ కీ సైతం బెస్ట్ డైరెక్ట్ ఆఫ్ ఫోటో గ్రాఫీ అవార్డు వచ్చినట్లు పేర్కొన్నారు. గ్యార కద్దు భార కొత్వాల్ లఘు చిత్రానికి తెలంగాణా ప్రభుత్వం ప్రధమ బహుమతి ఇవ్వడం పట్ల చిత్ర నిర్వాహకులకు, నిర్మాణ రంగంలోని పలువురు ప్రముఖులు అభినందించినట్లు ఆయన తెలిపారు. మహానటి సావిత్రి కళా పీఠం,ఈ సందర్బంగా ప్రత్యేకంగా సన్మానించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
addComments
Post a Comment