గతంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కొంతమందికి మాత్రమే పరిమితం


నెల్లూరు, జూలై 2 (ప్రజా అమరావతి):  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఓ సాహసోపేత నిర్ణయమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వడం సహజమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చమో, లేదో తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్లడం అందరి వల్ల కాదని, అన్ని హామీలు పారదర్శకంగా అమలు చేశాం కాబట్టే తాము ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పునరుద్ఘాటించారు. 

 శనివారం ఉదయం మనుబోలు మండలం వీరంపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలుత గ్రామంలో   నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను, సిమెంటు రోడ్లు, సైడ్ కాలవలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. 

 అనంతరం గ్రామంలోని బీసీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇప్పటివరకు వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, అర్హత ఉండి  ఏమైనా సంక్షేమ పథకాలు అందలేదా? ఇతర సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. ప్రతి గడప లోను మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికి ప్రభుత్వ పనితీరు, వారు పొందిన సంక్షేమ పథకాల లబ్ధిని మంత్రితో ఆనందంగా పంచుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల పూర్తి విశ్వాసం, సంతృప్తి వ్యక్తం చేశారు. 

 అనంతరం మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కొంతమందికి మాత్రమే పరిమితం


అయ్యాయని, అలా కాకుండా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కులమతాలకతీతంగా, పారదర్శకంగా అందజేశారన్నారు. గతంలో ఎస్సీ, ఎస్ టి, బీసీలకు 10 శాతం మాత్రమే లోన్లు ఇచ్చేవారని, మిగిలిన 90 శాతం మందిలో అర్హత గల వారి పరిస్థితి ఏమిటో తెలియదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని పూర్తి పారదర్శకంగా ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి  సంతృప్తస్థాయిలో అందజేస్తున్నామని, అందుకే సగర్వంగా ప్రజల వద్దకు వెళుతున్నామని చెప్పారు. అలాగే గ్రామంలో పర్యటించడం ద్వారా ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి పూర్తిచేయడం, అర్హత కలిగి సాంకేతిక సమస్యలతో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి, వారికి కూడా సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ సుధాకర్ రాజు, ఆర్ డి ఓ కొండయ్య, ఎంపీడీవో శ్రీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ నాగరాజు, వీఆర్వో భక్తవత్సల రెడ్డి, కార్యదర్శి రాజేశ్వరి, ఎంపీపీ వజ్రమ్మ, సర్పంచ్ ధనరాశి సుధాకర్, స్థానిక వైసీపీ నేత సురేందర్ రెడ్డి,  ప్రజా ప్రతినిధులు,  అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


Comments