మహిళా సాధికారిత వైపు వేగంగా అడుగులు *మహిళా సాధికారిత వైపు వేగంగా అడుగులు.* 


 *మెప్మా అధికారులతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సురేష్ సమీక్ష* .


పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా మహిళలకు అన్ని విధాలా చేయూత అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో మెప్మా అధికారులతో మంత్రి సమీక్షించారు. పట్టణాల్లోని పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా చేయూత అందిస్తుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. సహాయక సంఘాల బలోపేతం తో బ్యాంకు రుణాలు ఇప్పించడంలోనూ ముఖ్యంగా టిడ్కో గృహాల లబ్దారులకు బ్యాంకు లింకేజీ ఇప్పించే విషయంలో వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న మహిళా మార్ట్ లు విజయవంతంగా నడుస్తున్నాయాన్నారు. ఇంకా కొత్తగా అటువంటి మార్ట్ లు ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన పట్టణాలను సుందర నగరాలుగా తీర్చిదిద్దే  కార్యక్రమాలపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. జగనన్న హరితవనాలు, గ్రీనరీ, విరివిగా చెట్ల పెంపకాలు తదితర విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యత క్రమంలో ఇంకా శ్రద్ద తో నిర్వహించాలని, పలు నగరాలు సుందరంగా తయారు కావటానికి మీరు ప్రణాళిక రూపొందిస్తే అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం ద్వారా అందుతుందన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా మార్కాపురం పట్టణాన్ని పచ్చదనం పరిశుభ్రత లో ముందుండే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు  తయారు చేయాలని కోరారు.. ఈ సమావేశంలో మెప్మా ఎండి విజయలక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ ఎండి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments