తిరుపతి నగరం లో ఘనంగా చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ర్యాలీ



*తిరుపతి నగరం లో ఘనంగా చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ర్యాలీ


*


తిరుపతి, జూలై 23 (ప్రజా అమరావతి): తాను క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఈ జిల్లాకు ఇంత ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ రిలే రావడం గర్వకారణం అని, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా  ఆజాదీ కా అమృత్  మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడ, యువజన సర్వీసుల శాఖ మాత్యులు శ్రీమతి ఆర్కే రోజా అన్నారు. శనివారం ఉదయం స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి మహతి ఆడిటోరియం వరకు చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా సాంస్కృతిక శాఖ మాత్యలు,   గ్రాండ్ మాస్టర్ అకాష్, టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బా రెడ్డి,  స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణి మోహన్, శాప్ ఎం.డి. ప్రభాకర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి , తిరుపతి నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి, చెస్ ఓలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు , వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఎన్.సి.సి., స్కౌట్ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని, మహతి ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 ర్యాలీ నిర్వహణ అనంతరం మహతి ఆడిటోరియం లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ  ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మన దేశంలోని 75 ప్రదేశాలలో  చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహిస్తు కార్యక్రమం లో బాగంగా ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే తిరుపతి నగరంలో  నిర్వహించడం సంతోషమని అన్నారు.   ఈ జిల్లాకు చెందిన వ్యక్తినైన నేను క్రీడా శాఖ మంత్రిగా పాల్గొనడం  చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ కు మొట్ట మొదటిసారిగా మన దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది అని , ఈనెల 29వ తేదీ నుండి ఆగష్టు 9  వరకు తమిళనాడులోని మహాబలిపురంలో ఈ చెస్ ఒలింపియాడ్ జరగనున్నదని ఇందుకు కారణమైన గౌ.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి, తక్కిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ధన్యవాదాలని అన్నారు.  ఒలింపిక్ జ్యోతిని ఈరోజు మన తిరుపతికి తీసుకురావడం జరిగిందనీ, దీనిని ఢిల్లీ లో మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జూన్ 19 న ప్రారంభించారనీ మన దేశంలోని అన్ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో , 75  జిల్లాల్లో ఈ జ్యోతిని ప్రదర్శిస్తున్నారని  తెలిపారు. చదరంగంలో మన రాష్ట్రం లోని క్రీడాకారులు తమ సత్తా చూపుతున్నారనీ, మనందరికీ తెలిసిన మన విజయవాడకు చెందిన గ్రాండ్ మాష్టర్, అర్జున అవార్డు గ్రహీత...కోనేరు హంపి  ఉన్నారనీ గుర్తు చేశారు. కోనేరు హంపి మన రాష్ట్రం తరఫునే కాదు, మన దేశం తరఫున కూడా అనేక టోర్నమెంట్ లో ప్రపంచంలోని అనేక దేశాల్లో చదరంగం లో పాల్గొని  తెలుగువాళ్ల సత్తా ఏంటో చాటిచెప్పారనీ, అలానే గ్రాండ్ మాష్టర్ ముసునూరి రొహిత్ లలిత్ బాబు,  మన రాష్ట్రం, దేశం తరఫున దేశ విదేశాల్లో విశేషమైన ప్రతిభను  కనబరిచారని, అలానే గ్రాండ్ మాష్టర్ పెంటేల హరిక్రిష్ణ, గ్రాండ్ మాష్టర్ అర్జున అవార్డ్ గ్రహీత ద్రోణవల్లి హారిక గ్రాండ్ మాష్టర్, కార్తీక్ వెంకట్ రామణ్ కూడా మన రాష్ట్రం, దేశం తరఫున ఆడి విశేషమైన ప్రతిభని కనబరిచారని  కొనియాడారు. మన రాష్ట్రంలోని చెస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. మహాబలిపురంలో జరిగే ఈ చెస్ ఒలింపియాడ్ లో సుమారు 187 దేశాలకు సంబంధించిన చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారని ఖచ్చితంగా ఇందులో మన దేశానికి చెందిన క్రీడాకారులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన గ్రాండ్ మాష్టర్ లు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని  ఆకాంక్షించారు. చదరంగం అనేది ఎత్తుకు పై ఎత్తులు వేసేదని జీవితంలో కూడా ఎదుగుదల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తెనే మనం విజయం సాదించగలమని,  నేటి బాలలే రేపటి పౌరులని ఇదే స్ఫూర్తితో జీవితంలో కూడా ఎదగాలని హాజరైన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. 


భారతదేశం ఈ అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ క్రీడలను మొదటి సారిగా మహాబలిపురం లో  నిర్వహించడం గర్వకారణమని ఇప్పటికే విశాఖపట్టణం, విజయవాడ లో నిర్వహించి నేడు  ఘనంగా చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ర్యాలీ తిరుపతి కలియుగ వైకుంటం శ్రీవెంకటేశ్వర పాదాల చెంత ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ క్రీడల వల్ల విద్యార్థులలో మేధోశక్తి పెంపొందుతుందని తిరుమల శ్రీవారి అశీసులతో క్రీడల్లో మన రాష్ట్రం రాణించాలని అన్నారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశం మొదటి అంతర్జాతీయ  44 వ చెస్ ఒలంపియాడ్ క్రీడలను నిర్వహించడం గర్వకారణమని ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్ర రాష్ట్రాలు స్ఫూర్తి పొందేలా 3,4 స్థానాలలో ఉన్న మన దేశం చదరంగంలో మొదటి స్థానాన్ని శ్రీవారి ఆశీసులతో లక్ష్యం సాదిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.

ప్రముఖుల ప్రసంగాల అనంతరం  చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ను అతిధులు పుదిచ్చేరికి అందిచడానికి మెడాలిన్ సంస్థ ప్రతినిధులకు అందజేశారు.  


శ్రీ వినాయక ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన నటరాజ నాట్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ఎన్.సి.సి. ఆంధ్ర 29 బెటాలియన్ కల్నల్ సోమన్ అధికారి, తిరుపతి , చిత్తూరు జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థల ప్రతినిధులను, అతిధులను ఘనంగా సన్మానించారు.


Comments