ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలి



నెల్లూరు, జూలై 4 (ప్రజా అమరావతి):-- ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. 


సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్  తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రజల నుండి స్వీకరించే అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు  నిర్ణీత గడువులో గానే అర్జీలను పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలన్నారు. కొన్ని దరఖాస్తులు పరిష్కారం అయినా మళ్ళీ వస్తున్నాయని దీన్ని నివారించేందు కోసం క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారం ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు సరిగా పర్యవేక్షించాలన్నారు. 

పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.  కోర్టులో కేసు నమోదు అవ్వగానే సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి కౌంటర్ అఫిడవిట్లు వేయాలన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి  వెంకటనారాయణమ్మ, డి ఆర్ డి ఎ పి డి శ్రీ సాంబశివారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్. ఇ. శ్రీ సుబ్రహ్మణ్యం, తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎస్డిసి శ్రీ సుధాకర్, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, గృహ నిర్మాణ సంస్థ పిడి శ్రీ నరసింహం,  జిల్లా ఎస్సీ సంక్షేమం సాధికారత అధికారి శ్రీమతి రమాదేవి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, సర్వ శిక్ష పిఓ శ్రీమతి ఉషారాణి, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీమతి పద్మ , డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య , డీఈవో శ్రీ రమేష్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీ బ్రహ్మానందరెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి శ్రీ మహేశ్వరుడు, డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments