నేను కన్నెర్ర చేస్తే ఈ వైసిపి నేతలు ఇంట్లోంచి బయటకు రారు.

 మదనపల్లె, అన్నమయ్య జిల్లా (ప్రజా అమరావతి);


*మదనపల్లె మహానాడు సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*


టిడిపి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది...ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు...ఒక వ్యవస్థ...శక్తి. తెలుగు వారు అందరూ ఆరాధించే వ్యక్తి ఎన్టీఆర్.

రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వారు ఎన్టీఆర్

ఆడబిడ్డలకు ఆస్థి హక్కు వంటి సంస్కరణలు తెచ్చిన నేత ఎన్టీఆర్

మూడేళ్ల వైసిపి పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం. లేని సమస్యలు సృష్టించారు. 

మదనపల్లి సభకు ప్రజలు రాకుండా అనేక అడ్డంకులు సృష్టించారు.

నేను కన్నెర్ర చేస్తే ఈ వైసిపి నేతలు ఇంట్లోంచి బయటకు రారు. 


వైసిపి దోపిడీని ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా....కేసులు పెడతారా?

ఒక్క చాన్స్ ఇవ్వమని జగన్ పాదయాత్ర చేశాడు....నాడు నేను వద్దు అనుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా?

నేను ప్రజాస్వామ్య వాదిని...చేతగాని వ్యక్తిగా చూడవద్దు.

పాదయాత్రలో ఊరూరూ తిరిగి ముద్దులు పెట్టి...ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు జగన్

పేదల పిల్లలు కూడా చదువుకోవాలని...ఉన్నత ఉద్యోగాలు చెయ్యాలని పని చేసిన ప్రభుత్వం టిడిపి

నాడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్....పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ లతో విద్యకు అవకాశాలు కల్పించాం.

టిడిపి హయాంలో ఐటి, టీచర్, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే...జగన్ వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చాడు.

ఉమ్మడి ఎపిలో 1.60 లక్షల మంది టీచర్లను రిక్రూట్ చేసింది మనమే

అమ్మఒడి పేరుతో జగన్ మోసం చేశాడు...ఇప్పుడు ఆంక్షలు పెట్టాడు.

300 యూనిట్ల కరెంట్ వాడితే అమ్మఒడి రాదు..అమ్మఒడి ఒక బూటకంగా మారింది

నేను తిరుపతిలోనే ఎంఎ ఎకనమిక్స్ చదివాను...జగన్ ఎక్కడ చదివారో వైసిపి నేతలు చెపుతారా?

అమ్మఒడి బూటకం..ఇంగ్లీషు మీడియం ఒక నాటకం...నాడు నేడు అవినీతి మయం

పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వమే కారణం

జగన్ స్కూళ్ల మూసివేత పని మొదలు పెట్టాడు...తాను చదువుకోలేదు....ఎవరినీ చదువుకోనివ్వడు.

పిల్లలు వాగులు వంకల్లో నడిచి పాఠశాలకు వెళ్లాలా?

అన్నా చెల్లి ఉంటే ఇద్దరు కలిసి బడికి వెళ్లి వస్తారు...ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు.

టీచర్లపై కోపంతో విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేస్తున్నాడు

8 వేల గ్రామాల్లో స్కూళ్లు మూసేశారు.

ఈ స్కూళ్లు మూసివేస్తే కేంద్రం నుంచి అప్పులు వస్తాయని జగన్ కక్కుర్తిపడి పాఠశాలలు మూసివేశాడు.

పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ ప్రభుత్వ విధానాలను మహానాడు వేదికగా ఖండిస్తున్నాం

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మహానాడు వేదికగా తీర్మానం

మీ గ్రామంలో స్కూలు మూసివేస్తే వైసిపి నేతలను ఊరికి రానివ్వకండి

బాదుడే బాదుడుతో జగన్ నడ్డి విరుస్తున్నాడు.

అన్ని పొరుగు రాష్ట్రాల కంటే ఎపిలోనే ఆర్టీసి రేట్లు ఎక్కువ

వంట గ్యాస్ కొనే పరిస్థితి లేదు....మళ్లీ కట్టెల పొయ్యే శరణ్యం

అన్ని నిత్యావసర వస్తువులు పెరిగాయి. 

ఆంధ్ర గోల్డ్, నైన్ సీ హార్స్, సిల్వర్ స్ట్రైప్స్ మద్యంలో హానికర పదార్థాలు ఉన్నాయి.

ఈ బ్రాండ్స్ తాగిన వారు తీవ్ర ఆనారోగ్యం పాలవుతున్నారు.

జగన్ సొంత డిస్టలరీలు పెట్టుకున్నాడు...రేట్లు విపరీతంగా పెంచాడు.

టిడిపి హానికర బ్రాండ్ల వివరాలు బయటపెట్టగానే...వాటి అమ్మకం ఆపేశారు.

నెలకు రెండు వందల కోట్లు అక్రమార్జన కోసం నాసిరకం మద్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు.

వడ్రంగి పనులకు, లాండ్రీ పనులకు కూడా పన్ను వేసేందుకు జగన్ సిద్దం అయ్యాడు.

చేతి వృత్తుల వారిపై 5 వేల కోట్లు పన్నులు వేసేందుకు సిఎం సిద్దం అయ్యాడు

ప్రజా వేదిక నాది కాదు...ప్రజల సొమ్ము. దాన్ని కూల్చి వేశారు. ప్రజలు ఇలాంటి అంశాలపై స్పందించాలి.

ప్రభుత్వంపై పోరాటానికి ఇంటికి ఒకరు సిద్దంగా ఉండాలి. కేసులకు భయపడకండి.

తమ జీవితాలను నాశనం చేసిన సిఎంను యువత వదిలిపెట్టకూడదు

జాబ్ క్యాలెండర్ లేదు..స్కూళ్లు మూసేశారు....ఉపాధి లేదు.

నిరుద్యోగ బృతి ఇచ్చాం....విదేశీ విద్య ఇచ్చాం...

జగన్ కుమార్తెలు ప్యారిస్ లో, లండన్ లో చదవాలి...మన పిల్లలు వాగులు వంకలు దాటి వెళ్లాలా

జగన్ పెట్టిన ప్రతి కేసుపై చిత్ర గుప్తుడిలా లెక్కలు రాస్తున్నా...అధికారం లోకి వచ్చిన తరువాత అన్నింటికీ తిరిగి చెల్లిస్తాం.

కొందరు పోలీసులు తప్పుడు పనులు చేస్తున్నారు....తప్పుడు పనులు చేయమని అధికారులు చెప్పాలి.

చోడవరం సభలో పోలీసుల సమస్యలపై మాట్లాడితే....వారి కి నిధులు విడుదల చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు....డ్రిప్ కు సబ్సిడీ రావడం లేదు

రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చెయ్యాలి అనుకున్నాం...ఇప్పుడు విత్తనాలు కూడా లేవు.

క్రాప్ ఇన్స్యూరెన్స్ ను కూడా రైతులకు ఇవ్వకుండా వైసిపి దొంగలు తింటున్నారు.

జగన్ వచ్చి మూడేళ్లు అయ్యింది....హంద్రీనీవా పనులు ఏమయ్యాయి...జిల్లాలో నీళ్లు ఇచ్చారా

రాజంపేట పార్లమెంట్ లో రౌడీయిజం చెయ్యడానికి ఈ ప్రాంతం ఈ మంత్రి జాగీరు కాదు.

పుంగనూరులో దాడులు  చేస్తున్నారు...తంబళ్ల పల్లిలో అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేశారు.

టిడిపి నేతలపై దాడులు పిరికిపంద చర్యలు కాదా...మాకు దాడి చెయ్యడం రాదా

పదవులు, కాంట్రాక్టులు, ఇసుక, లిక్కర్ అన్ని ఈ మంత్రికే రావాలి

ఇక్కడ ప్రతిపాదించిన పనులు ప్రజల కోసం కాదు...ఈ వైసిపి నాయకుల కోసం

ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సొంత కంపెనీలకు పనులు ఇవ్వవచ్చా.

రాష్ట్రంలో ఎక్కువ మోటార్లు ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా....అలాంటి మోటార్లకు మీటర్లు పెడుతున్నారు...మీరు అంగీకరించకండి.

మోటార్లకు మీటర్లు పెడితే రైతుపైనే భారం పడుతుంది....మీటర్లు అవసరం లేదు.

ప్రభుత్వం అప్పుల కోసం రైతుల మొడకు ఉరితాళ్లు వెయ్యవద్దు

జగన్ పాలనలో బిసిలు తీవ్రంగా దెబ్బతిన్నారు....వారి కోసం ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు.

జగన్ ఇచ్చిన 50 బిసి కార్పొరేషన్ లలో ఒక్క రూపాయి లోన్ ఇచ్చారా.

ఎస్ సి, ఎస్టీలకు 28 పథకాలు రద్దు చేశారు.

మైనారిటీ యువతులకు ఇచ్చిన దుల్హన్ పథకం, రంజాన్ తోఫా రద్దు చేశారు.

జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారు....ఒక్కొ ఇంటిపై 7 లక్షల కోట్ల అప్పు.

అప్పుల సొమ్ము అంతా ఎటుపోయింది....ఒక్క రోడ్డు వేశారా...ఒక్క గుంత పూడ్చారా

ఒక్క ఊరిలో మూడేళ్లలో ఒక డ్రైనేజీ కట్టలేని జగన్...మూడు రాజధానులు కడతాను అంటున్నాడు

72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును నిలిపివేశారు.

రాయలసీమ లిఫ్ట్ అని జగన్ నాటకాలు ఆడారు....ఆస్కీం ఏమయ్యింది?

పుంగనూరు చిత్తూరు జిల్లాకు ఎలా వెళ్లింది...పుంగనూరు కూడా అన్నమయ్య జిల్లాకు రావాలి.

మదనపల్లి ని జిల్లా చెయ్యాలనే డిమాండ్ పై మీకు న్యాయం చేస్తా.

జిల్లాల విభజనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుతాం.

ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతా అన్నాడు...ఇప్పుడు జగన్ మెడలు దించుకున్నాడు

విభజన చట్టంలో హమీల కోసం జగన్ ఏం చేశాడు.

జగన్ ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే 600 మందిపై కేసులుపెట్టారు....180మందిని అరెస్టు చేశారు.

అక్రమ కేసులు పెట్టిన అధికారులను ఖచ్చితంగా భవిష్యత్ లో శిక్షిస్తాం.

వివేకా హత్య లో నాపై ఇష్టం వచ్చినట్లు రాసిన సాక్షిపై కేసు పెట్టారా...భారతీ రెడ్డిని అరెస్టు చేస్తారా.

వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులనే బెదిరించారు.

ప్రధాని మీటింగ్ కు రావాల్సిన ఎంపి రఘురామరాజును అడ్డుకున్నారు.

ఎంపి రఘురామ రాజు ట్రైన్ లో వస్తే ట్రైన్ తగలబెట్టి హత్య చేస్తారని భయపడి ఆయన ప్రధాని సభకు రాలేదు

నాపై కేసులుపెట్టిన ఒకే ఒక వ్యక్తి పిచ్చి జగన్ రెడ్డి...తిక్క జగన్ రెడ్డి

అమరావతికి వెళితే నా కాన్వాయ్ పై దాడి జరిగితే డిజిపి గా ఉన్న సవాంగ్ సమర్ధించారు

ఇప్పుడు సవాంగ్ ఏమయ్యారు....అన్న అన్న అని నాడు పలిచి ఇప్పుడు పక్కనపెట్టారు

మా ఇంటిపై దాడికి వైసిపి ఎమ్మెల్యే వస్తే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు అన్నారు.

జగన్ ప్రభుత్వంలో నవరత్నాలు కాదు...నవ ఘోరాలు.

జగన్ మూడేళ్లలో లక్షా 75  వేల కోట్ల అవినీతి చేశాడు...లిక్కర్, ఇసుక, భూముల్లో దోచుకున్నాడు

సాక్షి కోసం 300 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చాడు.

అప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షిపేపర్...ఇప్పుడు లాభాల పంట

మదనపల్లి నుంచి వెళ్లాల్సిన రైల్వే లైను ను పులివెందుల మీదుగా తీసుకువెళ్లాలి అని చూశాడు.

రైల్వే లైన్ మార్చితే అంగీకరించేది లేదు.

అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా.

మదనపల్లెలో 500 కోట్ల విలువైన ల్యాండ్ కొట్టేసే ప్రయత్నం జరుగుతుంది.

స్థలాన్ని స్థానిక ప్రజలు కాపాడుకోవాలి....మదనపల్లి జిల్లా కేంద్రం అయితే కార్యాలయం అక్కడే పెడదాం.

మదనపల్లి మహానాడును విజయవంతం చేసిన అన్నమయ్య జిల్లా ప్రజలకు ధన్యవాదాలు.

Comments