దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి పేద కుటుంబం సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది

 

నెల్లూరు (ప్రజా అమరావతి);

 

దారిద్ర రేఖకు  దిగువనున్న ప్రతి పేద కుటుంబం సొంతింటి కల సాకారం చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నద


ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  డా.ఆదిమూలపు సురేష్  పేర్కొన్నారు. 

 

శనివారం ఉదయం 

ఆత్మకూరు పట్టణం, నెల్లూరు పాలెంలో 75.90 కోట్ల రూపాయలతో  జి ప్లస్ 3 విధానంలో నిర్మించిన వై.యస్.ఆర్ జగనన్న కాలనీని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్, రాష్ట్ర వ్యవసాయ, సహకార,   మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, స్థానిక శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి లతో కలసి ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి పత్రాలు, తాళాలు అందచేశారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ,   సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర  ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన  తరువాత  ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నవరత్నాల కార్యక్రమం ద్వారా  పేదలందరికి ఇల్లు పధకం కింద  పట్టణ ప్రాంతంలో ఉన్న పేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు.

ఇళ్లు లేని వారికి సమాజంలో సరైన గౌరవం దక్కదు అన్నది  వాస్తవం.. ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్న నానుడి తెలిసిందే అన్నారు. ఆ కలను సాకారం చేసేందుకు ఎంత బడ్జెట్ అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. గతంలో నిర్మాణాలు చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో  రాజీ లేకుండా అన్నీ వసతులతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హతే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను అందచేయడం జరుగుచున్నదన్నారు.  ఆత్మకూరు పట్టణంలో నిర్మించిన 1056 గృహాలను ఈ రోజు సంబందిత లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను, తాళాలను అందచేయడం జరుగుతుందని తెలిపారు.  లబ్ధిదారులంతా ఒక సొసైటిగా ఏర్పడి ఈ కాలనీని పరిశుభ్రంగా చూసుకోవాలని,  రానున్న రోజుల్లో ఈ కాలనీలో ప్రైమరీ హెల్త్ సెంటర్,  సచివాలయం, అంగన్వాడీ సెంటర్  వస్తాయని మంత్రి తెలిపారు. 

 

రాష్ట్ర వ్యవసాయ, సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజల సంక్షేమాన్ని   దృష్టిలో వుంచుకొని  అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. గత 3  సంత్సరకాలంలో అవినీతికి తావులేకుండా కుల, మత,  రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి  సంక్షేమ  పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.  గతంలో అసంపూర్తిగా ఇంటి నిర్మాణాలు విడిచి పెడితే, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుని  వాటి నిర్మాణాలు పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఈ రోజు  ఇళ్ళ రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇంటి తాళాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 32.40 ఎకరాల విస్తీర్ణంలో  మూడు కేటగిరీల్లో చేపట్టిన  1056  ఇళ్ల నిర్మాణాల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంనకు సంబందించిన  672 ఇళ్లను 672 ఇళ్లను కేవలం 1 రూపాయకే రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందచేయడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు.

 

జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా వుంటూ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు   అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.  నవరత్నాల కార్యక్రమం ద్వారా  పధకాల క్యాలెండర్ ను  రూపకల్పన చేసిన ప్రతి మాసం రెండు లేదా మూడు పధకాలు నేరుగా లబ్ధిదారులకు అంధిస్తునట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ  పధకాలను  ప్రజల ముంగిటకే చేరవేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.   జిల్లాలో  3 వేల కోట్ల రూపాయలతో 32,464   పి.ఎం.ఎ.వై. ( పట్టణ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.  ఆత్మకూరు పట్టణంలో 1056  ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రామాయపట్నం వద్ద పోర్ట్ నిర్మాణానికి శంఖుస్థాపన జరగనున్నదని,  ఈ పోర్ట్ నిర్మాణం వలన  రానున్న రెండు సంవత్సరాల్లో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నట్లు కలెక్టర్ వివరించారు.

 

శాసన మండలి సభ్యులు శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో అన్నీ మౌలిక సదుపాయాలతో  ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు, 300 చదరపు అడుగుల ఇళ్లను కేవలం 1 రూపాయకే  లబ్ధిదారులకు అందచేయడం ఎంతో సంతోషంగా వుందన్నారు.  రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చేయడం జరుగుతొందన్నారు.

 

స్థానిక శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ,  రానున్న రోజుల్లో పెరుగుతున్న  జనాభాకు  అనుగుణంగా ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అన్నీ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నెల్లూరు పాలెం వద్ద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలకు సంబందించి 300 చదరపు అడుగులకు సంబందించి గత ప్రభుత్వం 25 వేలు డిపాజిట్, 2.65 లక్షల రూపాయలు లోన్ నిర్ణయించగా నేడు 1 రూపాయకే లబ్ధిదారునికి ఇవ్వడం జరుగుచున్నదని,  మిగిలిని రెండు కేటగిరిలకు సంబందించి 50 వేలు, లక్ష రూపాయలు డిపాజిట్ గా గత ప్రభుత్వం నిర్ణయించగా నేడు  వాటిని 25 వేలు, 50 వేలు గా నిర్ణయించడం జరిగిందని శ్రీ విక్రమ్ రెడ్డి తెలిపారు.

 

టిడ్కో ఛైర్మన్ శ్రీ  జే. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,   రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు , 300 చ. అ. ఇంటిని ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉచితంగా  రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారన్నారు.

           

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ కుమారి జి. వెంకట రమణమ్మ, టిడ్కో డైరెక్టర్ శ్రీమతి జీ.నాగేశ్వరీ,  మున్సిపల్  వైస్ చైర్మన్లు  శ్రీ  షేక్ సర్దార్,  డా. కె. వెంకట శ్రవణ్ కుమార్, టిడ్కో చీఫ్ ఇంజనీర్ శ్రీ  గోపాలకృష్ణా రెడ్డి, ఆర్.డి.ఓ శ్రీ టి. బాపిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ శ్రీ రమేష్ బాబు, ఆత్మకూరు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అబ్ధిదారులు, టిడ్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 


Comments