ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

 మంగళగిరి (ప్రజా అమరావతి);


*ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి*రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు  నవీన్ కుమార్ కార్యదర్శి ఇంటూరి గోపి రాజ్  డిమాండ్ చేశారు.శనివారం మంగళగిరి (వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో )AIYFకార్యాలయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నవీన్ కుమార్, గోపి రాజ్  మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న2.35లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు పెంచాలని ఎస్సై కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే మెగా

డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 10,000 ఇవ్వాలని, అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన  కోసం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 70%ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.గోడ ప్రతులను ఆవిష్కరించిన వారిలో AIYFసభ్యులురాంబాబు,గోపి,కుమార్,తదితరులు ఉన్నారు.

Comments