గోదావరి వరదలు – శాశ్వత పరిష్కారాలపై దృష్టి



*గోదావరి వరదలు – శాశ్వత పరిష్కారాలపై దృష్టి


.*

*బలహీనపడ్డ ఏటిగట్ల బోలోపేతం *

*నవంబరులోనే పనులు*

*రాజమహేంద్రవరంపై ప్రత్యేక దృష్టి*

*అధికార యంత్రాంగం పనితీరు భేష్‌*

*సంబంధిత శాఖల వారందరీకి అభినందనలు*

*ఇకపై ఇలానే కష్టపడి పనిచేయాలి*

*ప్రజలకు నాణ్యమైన సేవలు, పారదర్శకతే ప్రమాణాలు*

*బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగాలి*

*శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టండి*

*ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టండి*

*అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం*


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);

– గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. 

– రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌లో సమావేశమైన సీఎం.  

– గోదావరికి వరదల దృష్ట్యా శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలి:సీఎం

– 1986 వరద తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించింది. 

– రాజమహేంద్రవరం నగరానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలి:

– ఎన్యూమరేషన్‌ చేసిన తర్వాత సోషల్‌ ఆడిట్‌ చేస్తే ఎవరైనా మిస్‌ అయితే వారు మళ్ళీ దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి అవకాశం ఉంటుంది:

– అంతా పారదర్శకంగా ఉండాలి, ఎవరూ నష్టపోకూడదు:


– నిరంతరం ఇస్తున్న ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా వ్యవహరించిందని సీఎంకి తెలిపిన అధికారులు. 

– సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తంచేశారన్న అధికారులు.

– సహాయక కార్యక్రమాలకోసం అవసరమైన నిధులను వెంటనే సమకూర్చారని, దీనివల్ల మంచి సేవలు అందించగలిగామని సీఎంకు తెలిపిన అధికారులు. 

– పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్న అధికారులు

శానిటేషన్‌పై కూడా దృష్టిపెట్టామన్న అధికారులు

– మెడికల్‌ క్యాంప్‌లు కూడా రెడీగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్న అధికారులు:

– బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న ముఖ్యమంత్రిగారి సూచనను పరిగణలోకి తీసుకుని మరింత ఎక్కువ మందికి సాయం చేయగలిగామన్న అధికారులు:

– గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధ లేకపోతే మేం చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్న అధికారులు:

– రిలీఫ్‌ క్యాంపులలో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశాం, మీరు చెప్పిన సూచనల మేరకు చక్కటి ఆహారాన్ని అందజేశామన్న అధికారులు:

– ముందస్తుగా ఆర్ధిక భరోసా ఇవ్వడంతో ప్రజలకు తక్షణమే సాయం అందించగలిగామన్న అధికారులు:

– గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదు, మీ హయాంలోనే ఇదంతా చూస్తున్నామన్న అధికారులు:


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...*:


– లంక గ్రామాల్లో నష్టతీవ్రతపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం

– అందరితో మమేకం అయ్యి సహాయక చర్యలు కొనసాగించాలని, ఎక్కడా నిర్లిప్తంగా వ్యవహరించవద్దని సీఎం ఆదేశం. 

– గతంలో ఇలాంటి ప్రకృతివైపరీత్యాల సమయంలో కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారు, విపత్తుల సమయంలో నాయకులచుట్టూ తిరుగుతూ ఉండడంవల్ల పనుల్లో జాప్యం జరిగేది. 

– అధికారులను ఎంపవర్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి:

– వలంటీర్, సచివాలయం వ్యవస్థ వల్ల ఫలితాలు అందరికీ  అందుతున్నాయి:

– ఆ తర్వాత నేను రావడం వల్ల అన్నీ సవ్యంగా జరిగాయా?లేదా?అని తెలుసుకుంటున్నాను:

– నేను కూడా వరదల సమయంలో వచ్చి, నా చుట్టూ మిమ్మల్ని తిప్పి నలుగురిని సస్పెండ్‌ చేస్తే ఏమవుతుంది, ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి:

– ప్రతీ అధికారి మరి ముఖ్యంగా అందరూ లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే ఈ రోజు ప్రజలు చాలా సంతోషంగా చూసుకున్నారన్న మాట వినిపిస్తుంది, మీ అందరికీ నా అభినందనలు:

– మున్ముందు కూడా ఇదే మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళదాం:

–  నేను మార్గనిర్దేశం చేశాను, అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. 

– శానిటేషన్‌ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది:

–  మరోవైపు ఎన్యూమరేషన్‌ విషయంలో మరింత పారదర్శకంగా, కచ్చితంగా చేయాలి, రెండు వారాల్లో ఇదంతా పూర్తిచేసి తర్వాత సోషల్‌ ఆడిట్‌ కి పెడదాం, పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాం. 

– ఏ సీజన్‌లో జరిగిన నష్టం ఆ సీజన్‌ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోష పడతారు, దానిపై దృష్టిపెట్టండి, – ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసుకుని కష్టపడదాం

వారిని మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారు:


– విద్యుత్‌పునరుద్దరణపై ఆరా తీసిన సీఎం. వరద ప్రాంతాలలో ఎక్కడా కూడా కరెంట్‌ పునరుద్దరణలో జాప్యం జరగలేదు కదా? అని ప్రశ్నించిన సీఎం. 

– దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కౌంటర్‌ ఇవ్వండని అధికారులకు ఆదేశాలు

– తప్పులు జరిగితే సరిచేసుకోవాలి అంతేకాని ఏం జరగకపోయినా చేస్తున్న నెగిటివ్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలి:

– అవ డ్రెయిన్‌ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్దం చేయాలి:

– అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చు:

– కరకట్టల ఆధునీకరణపై వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్న సీఎం

– డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేసి వెంటనే నివేదించాలన్న సీఎం

– రాజమండ్రి పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్న సీఎం. 

– నిపుణులతో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం :

బండ్‌లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి నవంబర్‌ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుందామన్న సీఎం

– శాశ్వత చర్యలపై దృష్టిపెడదాం, నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలుపెడదాం

– మీ అందరూ కూడా మనం యుద్దం చేస్తున్నది టీడీపీతో చంద్రబాబుతో కాదు, నెగిటివ్‌ మీడియాతో యుద్దం చేస్తున్నాం, – మీడియా సంస్ధలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీకి అధికారం కోసం పనిచేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలి. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి.


సమీక్షా సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), గుడివాడ అమర్‌నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు.

Comments