నెల్లూరు (ప్రజా అమరావతి)
ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, ముత్తుకూరు మండలం, వల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో రెండో రోజు సుబ్బరాయలమిట్ట, అచ్చెన్నతోపు గ్రామాల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సేవలు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ, ఏమైన సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెల్పడం జరిగింది. ప్రతి కుటుంబాన్ని కలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.
ఈ సంధర్బంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగు చున్నదన్నారు. అర్హత ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా సంక్షేమ పథకాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ఈ కార్యాక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నామని, వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేయడంతో పాటు, వారి అవసరాలను తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. నిన్న వల్లూరు పంచాయతీలో పర్యటించినప్పుడు చుట్టుగుంట గ్రామంలో రచ్చబండ కావాలని గ్రామస్తులు కోరడం జరిగిందని, వెంటనే ఈ రోజు రచ్చ బండ నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలను మంజూరు ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే ఇంటి మద్యలో నీరు నిలుస్తున్నదని, దాని వలన దోమల బెడద ఎక్కువగా వున్నదని ప్రజలు తెల్పగా, నీరు నిల్వ కాకుండా రోడ్డును చదును చేయుటకు లక్ష రూపాయలు మంజూరు చయడం జరిగిందని, పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ ఏ.ఈ ను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే చుట్టుగుంట – పచ్చికాయలమిట్ట రోడ్డు నిర్మాణానికి 1 కోటి 11 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని, త్వరలో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నియోజక వర్గ పరిధిలోని ప్రతి గడపుకు వెళ్ళి వారి సమస్యలను, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు తక్షణమే పరిష్కరిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
మంత్రి వెంట ముత్తుకూరు మండలం ఎం.పి.పి శ్రీమతి గంగవరపు సుగుణమ్మ, తహశీల్దార్ శ్రీ మనోహర బాబు, ఎం.పి.డి.ఓ శ్రీమతి ప్రత్యూష, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment