వైఎస్సార్‌ రైతు దినోత్సవం


అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ రైతు దినోత్సవం


*


*మహానేత, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహానీయునికి ఘన నివాళులర్పిస్తూ నేడు (08.07.2022) వైఎస్సార్‌ రైతు దినోత్సవం*


*రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్ధాయిలో, ఆర్బీకేలలో రైతు దినోత్సవం వేడుకలు...రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, జిల్లా వనరుల కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసాయ అనుబంధ శాఖలపై ఎగ్జిబిషన్‌ స్టాళ్ళు ఏర్పాటు*


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు*

1. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌

2. రైతు భరోసా కేంద్రాలు

3. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు

4. ఇన్‌పుట్‌ సబ్సిడీ

5. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా

6. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వివిధ పథకాల క్రింద నేటి వరకు రైతన్నలకు అందించిన సాయం రూ. 1,27,633.08 కోట్లు*.


*రైతన్నల కోసం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన మరిన్ని విప్లవాత్మక చర్యలు*


రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు, రూ. 2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి

ఆక్వా రైతులకు ప్రస్తుతం ఉన్న 5 ఎకరాల విద్యుత్‌ సబ్సిడీ పరిమితిని 10 ఎకరాలకు పెంచి యూనిట్‌ రూ. 1.50 కే అందిస్తున్న ప్రభుత్వం

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, ఉచిత విద్యుత్‌ సబ్సిడీతో పాటు నాణ్యత పెంచేందుకు విద్యుత్‌ ఫీడర్లు

అనుభవజ్ఞులైన లక్షమంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్ధాయిలో వ్యవసాయ సలహా మండళ్ళు ఏర్పాటు

ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్‌ భాగస్వామ్యంతో పాలసేకరణ కేంద్రాలు, అమూల్‌ ద్వారా గతంలో కంటే అదనంగా లీటర్‌కు రూ. 5 నుండి రూ. 15 వరకు అదనంగా అందుకుంటున్న పాడి రైతులు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా, వారి కుటుంబాలకు అండగా రూ. 7 లక్షల ఆర్ధిక సాయం

వైఎస్సార్‌ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటర్లు కూడా ఉచితంగా అందించి రైతన్న సాగునీటి కలను నిజం చేసిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

Comments