నాలుగు అర్హత రోజుల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ


నెల్లూరు, జూలై 21 (ప్రజా అమరావతి): ఇక నుంచి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ  నాలుగు అర్హత రోజుల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ


చేసినట్లు  జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు తెలిపారు. 

 గురువారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఒక్క అర్హత రోజు మాత్రమే అవకాశంగా ఉండేదని, ఇప్పుడు నాలుగు అర్హత రోజుల్లో అనగా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఒకటవ తేదీన, ఈ నాలుగు విడతల్లో ఎప్పటికీ 18 సంవత్సరాల వయసు నిండుతుందో ఆ సమయంలో నమోదు చేసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదుకు సంబంధించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్  జాహ్నవి, డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, డ్వామా పీడీ  తిరుపతయ్య, నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీవోలు శ్రీ కొండయ్య, శ్రీ బాపిరెడ్డి, శ్రీ శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు. 


Comments