- చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ స్పూర్తి - చంద్రన్న భరోసాకు అనూహ్య స్పందన
 *- చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ స్పూర్తి - చంద్రన్న భరోసాకు అనూహ్య స్పందన


 *- కార్వేటి నగరం రోడ్ షోలో శిష్ట్లా లోహిత్*  గుడివాడ, జూలై 9 (ప్రజా అమరావతి): చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు నిర్వహించిన ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. శుక్రవారం రాత్రి కార్వేటి నగరం రోడ్ షోలో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణానికి చెందిన శిష్ట్లా లోహిత్ రాష్ట్రస్థాయిలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమం కో ఆర్డినేటర్ పదవులను నిర్వహిస్తుండడంతో ఆయన చంద్రబాబు కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు. గత నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ స్పూర్తి - చంద్రన్న భరోసా కార్యక్రమాలను జయప్రదం చేయాలంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ద్వారా ప్రచారం కూడా చేశారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ లో పార్టీ కార్యకర్తల బయోడేటా, ఫోన్ నెంబర్లను నమోదు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశాల్లోనూ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్వేటి నగరంలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు స్వయంగా శిష్ట్లా లోహిత్ ను తన కాన్వాయ్ పైకి ఎక్కించుకున్నారు. భారీ జన సందోహం నడుమ రోడ్ షోను కొనసాగించారు. అనంతరం శిష్టా లోహిత్ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా కార్యక్రమాలకు అన్నివర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన ఎదురైందని చెప్పారు. ఆత్మీయ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి చంద్రబాబు, నారా లోకేష్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. వైద్యం, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రూపొందించిన యాప్ లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నారని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో విజయవంతమయ్యామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా పార్టీని అన్నిస్థాయిల్లో బలోపేతం చేయడం జరుగుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ స్పూర్తి - చంద్రన్న భరోసా కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు శిష్ట్లా లోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments