*టిడిపి రైతు పోరాటానికి పోలీసుల అడ్డంకులు
*
*రాత్రివేళ పరిటాల ఇంటి వద్ద పోలీసుల పహారా*
*రైతు సమస్యలు అక్రమ మైనింగ్ పై చలో గొందిరెడ్డిపల్లికి పిలుపునిచ్చిన మాజీ మంత్రి పరిటాల సునీత*
*శనివారం జరిగే కార్యక్రమానికి పోలీసుల అడ్డంకులు*
*ఇటు అనంతపురం.. అటు వెంకటాపురంలో పరిటాల ఇంటి వద్ద పోలీసుల పహారా*
*నిరసన కార్యక్రమానికి వెళ్లకూడదంటూ పోలీసుల నోటీసులు*
*పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్*
రైతు సమస్యలు, అక్రమ మైనింగ్ పై టిడిపి చేపట్టిన చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమానికి పోలీసులు రాత్రి నుంచి అడ్డంకులు సృష్టించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుతో పాటు గొందిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శనివారం రోజు తలపెట్టిన ఈ కార్యక్రమానికి టిడిపి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా అడ్డంకులు సృష్టించారు. రాత్రి 9 గంటల సమయంలో అనంతపురం తోపాటు వెంకటాపురంలో పరిటాల కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు వచ్చి నిరసనకు వెళ్లకూడదంటూ నోటీసులు ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టించడం సరైన చర్య కాదని.. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మాత్రమే వెళుతున్నామని ఎలాంటి ఆందోళనలు చేయడం లేదని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. దీనికి తోడు ఇంటి వద్ద పోలీసుల పహారా కూడా ఏర్పాటు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులతో పాటు అన్ని వర్గాల వారు వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విధానాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా మీటర్లు భిగిస్తామని మొండిగా ప్రభుత్వం మొండి గా వెళ్తుందన్నారు. దీనికి తోడు అక్రమ మైనింగ్ పై తమ అనేక సార్లు ఫిర్యాదులు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ నేతల ప్రోత్బలంతో మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన తాము గొందిరెడ్డిపల్లికి వెళ్లి తీరుతామని వారు స్పష్టం చేశారు...
addComments
Post a Comment