ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల హోల్డింగ్ పాయింట్ల వివరాలు:

                

డి‌ఐ‌జి కార్యాలయం 

గుంటూరు  (ప్రజా అమరావతి);



గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, పెద్దకాకాని వద్ద జాతీయ ఎన్‌హెచ్-16  వద్ద జరిగే వై‌ఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్రమబద్ధీకరించడానికి వీలుగా సాధారణ ప్రజల సమాచారం కోసం దీని ద్వారా తెలియజేస్తున్నాము. 08-07-2022 ఉదయం 08:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు మరియు 09-07-2022న ఉదయం 08:00 గంటల నుండి రాత్రి 10:00   గంటల వరకు. కింది ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల  హోల్డింగ్  పాయింట్ల వివరాలు:                

భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు :

             అన్ని భారీ వాహనములు మరియు లారీలను 08-07-2022 ఉదయం 08:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు  మరియు ది. 09.07.2022   ఉదయం 08గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ క్రింది ప్లీనరీ సదస్సు జరుగుతున్న జాతీయ రహదారిపైకి రాకుండా క్రింద సూచించిన మళ్ళించడం జరుగుతుంది.


1. చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు మరియు ఇబ్రహీంపట్నం, 

   నందిగామ, వైపుకు వెళ్ళు  భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా  త్రోవగుంట వద్ద  

    నుండి  చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు – గుడివాడ –  హనుమాన్ జంక్షన్ 

   మీదుగా విశాఖపట్నం మరియు  ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.


2. చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే  వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు, 

     నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి  మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను.

3. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను  చిలకలూరు పేట 

    నుండి NH-16 మీద  పెదనందిపాడు ,కాకుమాను, పొన్నూరు , చందోలు  , 

     చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – 

     హనుమాన్ జంక్షన్  మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.


4. చెన్నై నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నం 

    గ్రామం, ఏ.బి.పాలెం వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు , చందోలు  , చెరుకుపల్లి , 

    భట్టిప్రోలు , పెనుమూడి    బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ 

    జంక్షన్ మీదుగా  విశాఖపట్నం వైపు మళ్లించబడును.


5. గుంటూరు నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను బుడంపాడు X మిధుగా తెనాలి, 

     వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు 

    –  గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

5. విశాఖపట్నం  వైపు నుండి చెన్నై వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ 

     జంక్షన్ వద్ద నుండి  గుడివాడ – పామర్రు -  అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల – 

     త్రోవగుంట – ఒంగోలుజిల్లా  మీదుగా  మళ్ళించడం జరుగు తుంది.

6.  గుంటూరు వైపు నుండి విజయవాడ వచ్చు వాహనములు : గుంటూరు , తాడికొండ ,   

    తుళ్ళూరు , వెంకటపాలెం , యెర్రబాలెం , డాన్ బాస్కో స్కూల్ , ఉండవల్లి సెంటర్ , 

     తాడేపల్లి పెట్రోల్ బంక్, వారది మీదుగా విజయవాడ చేరుకోవలయును .


7. రాజమండ్రి నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనములు , దివాన్ చెరువు, 

     ధవళేస్వరం బ్రిడ్జి, కొవ్వూరు , జంగారెడ్డి గూడెం , అస్వరావు పేట , సత్తుపల్లి మీదుగా  

     మళ్ళించడం జరుగుతుంది.

8. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ 

     జంక్షన్ వద్ద నుండి నూజివీడు- మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు 

    మళ్ళించడం జరుగుతుంది.

9. గన్నవరం వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు వాహనములు కేసరపల్లి , ముస్తాబాద్, 

    ఇన్నర్ రింగ్ రోడ్ , పైపుల రోడ్, ఇబ్రహింపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

10. హనుమాన్ జంక్షన్ వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు వాహనములు గన్నవరం గాంధి 

    బొమ్మ,ఆగిరి పల్లి, జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

11.భారి సరుకు రావాణ వాహనములను-గన్నవరం, ఆగిరి పల్లి, జి కొండూరు,    

    ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

12. హైదరాబాద్ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే  వాహనాలు నార్కెట్ పల్లి , నల్గొండ, 

     మిర్యాలగూడ,  నడికుడి, పిడుగురాళ్ళు, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై 

      వెళ్ళవలెను.


13. హైదరాబాద్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళు లారీలు, భారీవాహనములు 

      ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి -కొండూరు – మైలవరం-  నూజివీడు -హనుమాన్ 

       జంక్షన్ వద్ద నుండి అనుమతిస్తారు.

14. చెన్నై వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే  multi-axel Goods వాహనాలను 

      ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారి కి సమీపంలోని  చిలకలూరి పేట, 

       ఒంగోలు మరియు నెల్లూరు వద్ద నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 10 గంటల 

      అనతరం వాహనాలను అనుమతిస్తారు.

15. విశాఖపట్నం వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను  

     హనుమాన్ జంక్షన్ వద్ద మరియు పొట్టిపాటు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి 

      సమీపంలో నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 9 గంటల అనతరం వాహనాలను     

      అనుమతిస్తారు.

గుంటూరు వైపు నుండి ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

పాస్ట్రోల్ ట్రైనింగ్ సెంటర్ (నిర్మల సెంటర్ –కట్ ఆఫ్ ) మోటార్ ద్విచక్ర వాహనములు  -1500.

ఆంద్ర జ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఆవరణ –మోటార్ కార్లు – 20

అములోద్భావి హోటల్ – ౩౦౦ కార్లు 

జైన్ టెంపుల్ ఆవరణ-4 వీలర్స్ పార్కింగ్ 

దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్-4 వీలర్స్ పార్కింగ్

కంతేరు రోడ్డు-బస్సుల పార్కింగ్ 

నంబూరు రోడ్డు :భీమవరం గ్రాండ్ -

నంబూరు రోడ్డు-1:

నంబూరు రోడ్డు-2:

కేశవ రెడ్డి స్కూల్: 4 వీలర్స్ పార్కింగ్

కేశవ రెడ్డి స్కూల్ వెనుక -4 వీలర్స్ పార్కింగ్

కంతేరు రోడ్డు రైల్వే గేటు నుండి సాయి భారతి హోం వరకు- కార్ పార్కింగ్ 

రైల్వే గేటు దగ్గరలో సాయి భారతి హోం అపార్ట్మెంట్ ఎదురు గా వున్న అపార్ట్మెంటు - కార్ పార్కింగ్

కంతేరు రోడ్డు లో వైట్ ఫెన్సింగ్ ఖాళీ ప్రదేశము:

ఎడ్ల పందేముల ర్యాంప్ (15 ఎకరముల ఖాళీ ప్రదేశము )

పల్లలమ్మ చెరువు నుండి కంతేరు రోడ్డు (రోడ్ మార్జిన్):4 కి.మీ 

ఖలీల్ డాబా వెనుక వైపు : జనరల్ పార్కింగ్ 

బైబుల్ మిషన్ మైదానము రోడ్డు నెం.1: పోలీసు వాహనముల పార్కింగ్ 

పెంతెకోస్తు కాంపౌండ్ : 

హాయ్ లాండ్ 

కొప్పురావూరు రోడ్ 

పోలిశెట్టి టుబాకో కాంపౌండ్ :

NRI ఆసుపత్రి ప్రక్కన గల ఇసుక డంపింగ్ ప్రదేశము 

జాతీయ రహదారి సర్వీసు రోడ్ –కాజ గ్రామం నుండి దీపకా అండర్ పాస్ వంతెన వరకు 

జాతీయ రహదారి సర్వీసు రోడ్ –నంబూరు  గ్రామం నుండి పెదకాకాని వై జంక్షను వరకు 

విజయవాడ వైపు నుండి ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

ఆర్.కె.వేనుజియా పార్కింగ్ 

అను నార్త్ గేటు పార్కింగ్ 

అను మెయిన్ గేటు పార్కింగ్ 

అను సౌత్ గేటు పార్కింగ్ 

అయోధ్య రామిరెడ్డి & సన్స్ పంక్షన్ హాల్ ప్రదేశము 

వి.ఐ.పి మరియు వి.వి.ఐ.పి. వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

బైబుల్ మిషన్ భవంతి పశ్చిమ వైపున వున్న ప్రదేశము : MLAs/MPs/MLCs

మరియు Z.P.chair persons

JMJ స్కూల్ పార్కింగ్ : గౌరవనీయులైన ముఖ్య మంత్రివర్యుల కాన్వాయ్ వాహనముల పార్కింగ్. 

St.Anns. కాంపౌండ్ పార్కింగ్ 


మీడియా వారికి విజ్ఞప్తి: ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు FM స్టేషన్లుయొక్క ఎడిటర్‌లు మరియు డైరెక్టర్‌లందరికీ ప్రజల భద్రత దృష్ట్యా విస్తృత ప్రచారం/టెలికాస్ట్ చేయమనిఅభ్యర్థిస్తున్నాము.



                                                                                   డి‌ఐ‌జి, గుంటూరు.

Comments