చెస్ పోటీల్లో సుచిత్ర క్రిస్టిన్ ప్రతిభ

 *చెస్ పోటీల్లో సుచిత్ర క్రిస్టిన్ ప్రతిభ


*


*సుచిత్ర ను అభినందించిన పలువురు ప్రముఖులు*


భీమవరంలో నిర్వహించిన  జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ఏలూరు నగరానికి చెందిన సుచిత్ర క్రిస్టియన్ ద్వితీయ స్థానం సాధించింది.సెయింట్ థెరిస్సా బాలికొన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న సుచిత్ర ఆజదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెస్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. ఈనెల 17న విజయవాడలో నిర్వహించిన పోటీల్లో గ్రాండ్ మాస్టర్ తో చెస్ ఆడిన సుచిత్రకు పలువురు అభినందనలు తెలిపారు. సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు మురళీకృష్ణమ్మ మాట్లాడుతూ, పిల్లలకు చదువుతోపాటు ఆటలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. సుచిత్ర క్రిస్టిన్ మరిన్ని టోర్నమెంట్లలో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సుచిత్ర మాట్లాడుతూ, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

Comments