మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతోంది


అల్లూరి సీతారామరాజు జిల్లా (ప్రజా అమరావతి);


*అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*చింతూరులో హెలీప్యాడ్‌ వద్ద వరద తీవ్రత, సహాయ చర్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం.*


*అనంతరం గోదావరి ముంపునకు గురైన కొయగురు గ్రామంలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సీఎం*

*కొయగురు నుంచి చట్టి వరకు దారిపొడవునా వరద బాధితులను నేరుగా కలుస్తూ.. వారికి భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సాయంపై స్వయంగా తెలుసుకున్న సీఎం*


*కొయగురు,చింతూరు*

*అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహరం చెల్లిస్తాం*

*అందరికీ న్యాయం చేస్తాం*

*మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతోంది


.*

*కేంద్రంపై గట్టి ఒత్తిడి తెస్తాం*

*త్వరితగతిన ఇళ్లు పూర్తి చేస్తాం*

*అందరికీ పూర్తి పరిహారం అందించిన తర్వాతనే తరలిస్తాం*


*వరద బాధితులకు సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు*

*దారిపొడువునా బాధితులతో ముచ్చటిస్తూ... వారికి భరోసా కల్పించిన వైయస్‌ జగన్‌*

*నాలుగు ముంపు మండలాలు (చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, ఎటపాక)  రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించిన సీఎం*

*నష్టపోయిన ప్రతి ఇంటికీ, పంటకూ పరిహారం ఇస్తామని స్పష్టీకరణ*

*ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హామీ*

*మనది ఎలా ఎగ్గొట్టాలన్న ప్రభుత్వం కాదు.. ఎలా ఇప్పించాలని ఆలోచించే ప్రభుత్వం:*

*ముంపు సమయంలో వరద బాధితులను ఆదుకోవడంలో సమర్ధవంతంగా పనిచేసిన అధికారులు, సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు* 

*ముంపు ప్రాంతాల పర్యటనలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....* 


20 రోజులుగా కలెక్టర్‌ నాలుగుమండలాల్లోనే ఉన్నారు. గతంలో ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జేసీలు ఉండేవారు. ఈ రోజు వ్యవస్ధలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు 6 మంది కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు ఉన్నారు. వీరికి తోడుగా వాలంటీర్లు ఉన్నారు. ఏ  ఒక్కరికీ సాయం అందలేదన్న పరిస్థితి లేదు.

మీకు ఇప్పటికే 25 కేజీల బియ్యంతో సహా ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసరాలు అందరికీ అందాయా ? లేదా  . ఈ స్ధాయిలో పారదర్శకంగా ఎప్పుడూ గతంలో జరగలేదు.


*ఇంతగా ఈ నలుగుమండలాలకి ఇబ్బంది వస్తే..* వీటికోసమే కలెక్టర్‌ ఇక్కడే తిష్టవేసి, ప్రతి  మండలంలోనూ, ఊరులోను ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూశారు. కలెక్టర్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర అధికారులకు ప్రజలు, ప్రభుత్వం తరపున నా తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 


సాధారణంగా నాయకులు వస్తారు...  అది బాగోలేదు.. ఇది బాగోలేదంటూ ఒకరిద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి వెళ్లి పోయే పరిస్థితి. అలా కాకుండా అధికారులకు ఏం వనరులు కావాలో అవి వారి చేతిలో పెట్టి వారికి దిశానిర్దేశం చేశాం. మరలా వారం రోజుల్లో నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదని మాట రాకూడదని ఆదేశాలు ఇచ్చాం. ఒక్క ఇంట్లో కూడా మాకు మంచి జరగలేదనే మాట వినబడకుండా తోడుగా నిలబడ్డ అధికారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 


వరద బాధితులందరికీ రేషన్‌ సరుకులు, కుటుంబానికి రూ.2 వేల సాయం వెనువెంటనే అధికారులు పంపిణీ చేశారు. దీనికి  కూడా వారిని అభినందిస్తున్నా. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపంసంహరించిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్యూమరేషన్‌ ప్రారంభిస్తాం.


ఎవరికి తాటాకు ఇళ్లు, పొలాలు, పంటలు నష్టం జరిగినా బాధపడవద్దు.  ఇళ్లకు, పంటలకు నష్టం జరిగిన  మేరకు తగిన పరిహారం ఇస్తాం. ఆ విషయం ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలని ఆలోచన చేయదు. ఎలా ఇప్పించాలని ఆలోచన చేసే ప్రభుత్వం మనది. ఎవరికి ఏ నష్టం జరిగినా భయపడవద్దు. అది ఇళ్లకు సంబంధించి అయినా.. లేక పంటలకు సంబంధించి అయినా సరే.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. సచివాలయ వ్యవస్ధ ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉన్నాడు. ఎవరికి నష్టం జరిగినా వాలంటీర్‌ పేరు నమోదు చేసుకుని.. మీ గ్రామ సచివాలయంలో జాబితా ప్రదర్శిస్తారు. రెండు వారాల్లోపు గ్రామ సచివాలయాల్లో నష్టపోయినవారి వివరాలతో జాబితాను ప్రదర్శిస్తాము. అప్పటికీ ఆ జాబితాలో ఎవరివైనా పేర్లు లేనట్లయితే.. మరలా వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అందుకోసం మరో రెండు వారాలు సమయం ఇస్తాం. మరో రెండు వారాల్లో  రీవెరిఫికేషన్‌ చేస్తాం. తరువాత మరో రెండు వారాలు సమయం నాకివ్వండి. మొత్తంగా 8 వారాలు లేదా 2 నెలల్లో ప్రతి ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందిస్తాం.


ఐటీడీఏ పరిధిలోకి ఉన్నందున పూరి గుడిసెలకు గతంలో ఇచ్చిన రూ.4 వేల నుంచి 10 వేలకు నష్టపరిహారాన్నిపెంచి ఇస్తాం. మంచి మనసుతో, మానవత్వంతో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ప్రతి అడుగు వేస్తాను. ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి. 


పోలవరం ముంపునకు సంబంధించిన  అంశాలన్నీ మీకు పూర్తిగా తెలిసినవే.  ఆర్‌అండ్‌ అర్‌ ప్యాకేజీ 45.72 అంటే పూర్తి నీటి మట్టం వరకు ప్యాకేజీ ఇవ్వాలంటే మరో 20 వేల కోట్లు అవసరమవుతాయి. దీనిపై రోజూ కేంద్రంతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే రూ. 2,900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.  మాకు చెల్లించండని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పలు దఫాలుగా లేఖలు కూడా రాశాం. ఆ కార్యక్రమం ఒకవైపు జరుగుతూనే ఉంది.  

  

పోలవరం ప్రాజెక్టు పూర్తయినా మనం పూర్తిగా నీళ్లు నింపం.  డ్యామ్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి నీళ్లు నింపకూడదని..  కేంద్ర జలవనరుల సంఘం చెబుతోంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలి సంవత్సరం కొంత నీటిని నింపుతాం, అలా దఫాలుగా మూడేళ్లలో డ్యామ్‌ను నింపుతాం. 


ఈ నేపధ్యంలో రిజర్వాయరును పూర్తిగా నీటితో నింపే నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా.. ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా చూస్తాము. ఆలోపు కేంద్రం నుంచి డబ్బులు వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తాం. కేంద్రం నుంచి ఆ స్థాయిలో డబ్బులు రాకపోతే .. రిజర్వాయరులో నీటిని నింపడం అయినా అపుతాము లేదా మీకు పరిహారం చెల్లించిన తర్వాతే  నీటి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా పరిహారం చెల్లించే కార్యక్రమం చేస్తాం. 


*మీ త్యాగంతోనే రాష్ట్రానికి మంచి*

మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతోందని నేను మనస్ఫూర్తిగా నమ్మతున్నాను.  మీకు అన్యాయం జరగనివ్వను.  మీకు  ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. కేంద్రం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిధులు తీసుకుస్తాం.  ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 41.15 లెవర్‌ వరకు అందరికీ పీడీఎఫ్‌ లు చెల్లిస్తాం. మీకివ్వాల్సిన డబ్బులు ఇచ్చి.. నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం. ఆ లెవల్‌ వరకు కచ్చితంగా పూర్తి చేస్తాం. 

 

1986 తర్వాత ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత ఇంతటి వరద వచ్చింది. రూ.1000 కోట్లో,  రూ.2వేలకోట్లయితే ఇంతగా ఆలోచన చేయను. నేనే చెల్లించేవాడిని. ఇది రూ. 20 వేల కోట్లకు సంబంధించి విషయం అయినందున కేంద్రం సహాయం కూడా మనకు తప్పనిసరి. దీనికి ప్రత్యామ్నాయం కూడా లేదు. 41.15 లెవల్‌ వరకు మాత్రం సెప్టెంబర్‌ లోపల అందరి చేతుల్లో డబ్బులు పెట్టి, ఇళ్లలోకి తరలిస్తామని హామీ ఇస్తున్నా.  ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా.. ఎవరెవరికి ఎంతెంత పరిహారం చెల్లించాలో మొత్తం పూర్తిగా చెల్లిస్తాం. మిగిలిన దానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. 


*వినడానికి.. భరోసా ఇవ్వడానికే వచ్చా..*

రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసే సామర్థ్యమే ఉంటే మీ గ్రామాలను వెంటనే తరలించే వారం.. మీకు వాస్తవ పరిస్థితులను ఈ విధంగా వివరించాల్సి వచ్చేదే కాదు. కానీ ఇది చిన్నమొత్తం కాదు. మీ తరపున కేంద్రంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తా. వాస్తవ పరిస్థితిని వివరిస్తాం. ఏ రోజైనా ఇచ్చేది కాబట్టి.. వీలైనంత త్వరగా ఇప్పించాలని చెపుతాం.


గతంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్‌.రాజశేఖర్‌ రెడ్డి రూ.1.50 లక్షలు ప్రకటించగా..  వారికి కూడా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించిన నేపధ్యంలో... బ్యాలెన్స్‌ డబ్బులు మిగిలిన రూ. 3.5 లక్షలు కూడా ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని తరలిస్తాం.  దానికి సంబంధించిన ఇప్పటికే జీవో కూడా జారీ చేశాం. మన చేతిలోని పనే కాబట్టి వాటిని వెంటనే ఇప్పిస్తా.  నాన్నగారి హయాంలో ఎవరైతే  అడుగులు వేశారో...త్యాగం చేశారో వారిని పై స్థానంలో ఉంచుతా.. అందులో మీరు కూడా ఉన్నారు కనుక.. మీకు ఆ రూ.3.5 లక్షలు ఇచ్చిన తర్వాతే షిప్ట్‌ చేస్తాం. 


*నాలుగు మండలాలు కలిపి కొత్త రెవెన్యూ డివిజన్‌*  

కొందరు స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముంపు మండలాలైన చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, ఎటపాక కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌ చేయమని విజ్ఞప్తి చేశారు. దానికి కూడా  ఆమోదం తెలుపుతున్నా. 


ఈ గ్రామానికి చెందిన భూమికి పరిహారం విషయమై అడిగారు. ఈ గ్రామం 45 లెవల్లో ఉంది. ఇది కేంద్రం చేతుల్లో ఉంది.  అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తాం. 

మన ప్రభుత్వం పనిచేస్తున్నంత మానవత్వంతో మరే ప్రభుత్వం పనిచేయలేదు. ఆ స్ధాయిలో మనం పనిచేస్తున్నాం. ఎవరకీ అన్యాయం జరగనివ్వమని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భరోసా ఇచ్చారు.

Comments