మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం

 *మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం* 



*మేం తలచుకుంటే జగన్‌ పాదయాత్ర చేసే వారా? *


*అమ్మ ఒడి బూటకం..ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకం*


*ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి*


* టీడీపీ అధినేత చంద్రబాబు


*చిత్తూరు జిల్లా మదనపల్లె లో ‘ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో టీడీపీ  భారీ బహిరంగ సభ*

చిత్తూరు జిల్లా మదనపల్లె లో ‘ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో టీడీపీ  భారీ బహిరంగ సభ నిర్వహించింది. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ  శ్రేణులనుద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ‘‘మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నాం. ఎక్కడ చూసినా సమస్యలు.. లేని సమస్యలు సృష్టించారు.  ప్రశ్నించిన వారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైసీపీ  నాయకులు బయటకు రాలేరు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేరు. మేం తలచుకుంటే జగన్‌ పాదయాత్ర చేసే వారా? ఆరోజు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకున్న పార్టీ టీడీపీ. మా హయాంలో ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు కట్టించాం. అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పార్టీ. అమ్మ ఒడి బూటకం, ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకం, నాడు- నేడు అవినీతి మయం’’ అని చంద్రబాబు విమర్శించారు.*


*ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి : ‘‘వైసీపీ  ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై తీవ్ర భారం మోపారు. మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షలో మద్యంలో రసాయనాలు ఉన్నాయని తేలింది. జగన్‌ సొంత డిస్టిలరీలు పెట్టుకుని రేట్లు పెంచారు. నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలా? మూడేళ్లలో ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. కొత్తగా రూ.5వేల కోట్ల వృత్తి పన్ను వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డితో పలువురు జిల్లా నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో మదనపల్లె జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం  పలికారు.

Comments