వీఆర్ఏల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా?

 వీఆర్ఏల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా?

 తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి  జూలై 26 (ప్రజా అమరావతి );సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి తాసిల్దార్ కార్యాలయం ముందు గత రెండు రోజుల నుండి కొనసాగుతున్న వీఆర్ఏల నిరవరిక దీక్ష కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మద్దతు మ్ప్రకతించారు.వారి యొక్క సాధకబాధకాలను తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల జీవితాలతో చెలగాటం ఆడటం సరైనది కాదని అన్నారు. వీఆర్ఏలకు 2017 సంవత్సరంలో ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమై నిద్ర పోతున్నట్లు గా వ్యవహరించదాన్ని విమర్శించారు. అదేవిధంగా 2020 సంవత్సరంలో వీఆర్ఏలకు తగిన న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటలతో వరాలు కురిపించి నట్లు హామీలు ఇచ్చి నెరవేరకపోవడం చాలా బాధకరమని అన్నారు. అదేవిధంగా ఇకనైనా వీఆర్ఏల పే స్కేల్ జీవోను, అర్హత కలిగిన వారిని  ఉద్యోగాలకు తీసుకోవాలని, 55 సంవత్సరాలు దాటిన వారి యొక్క వారసులకు వీఆర్ఏ గా ఉద్యోగ అవకాశం కల్పించాలని , వీఆర్ఏల నిరవరిక దీక్ష కు మద్దతుగా వారికి న్యాయం చేకూరే వరకు ఉంటామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు. నిరవరిక దీక్ష లో వీఆర్ఏల జేఏసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వై. మురళీధర్, మండల్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్ ఇంద్రయ్య , బాలయ్య, రేణుక దేవి, మన్నెమ్మ, సుమతి మరియు జిల్లా జేఏసీ వీఆర్ఏలు పాల్గొన్నారు.

Comments