భూ కబ్జాపై మాజీ ఎమ్మెల్యే వనమాడి ఆరోపణలలో నిజం లేదు.
మేయర్ శివప్రసన్న
కాకినాడ, జూలై 30: కాకినాడ నగరంలోని సురేష్ నగర్ పార్కులోని సుమారు రెండు ఎకరాల స్థలంలో కబ్జా చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) చేసిన ఆరోపణలలో ఎంత మాత్రం నిజం లేదని కాకినాడ నగర మేయర్ సుంకర శివ శివప్రసన్న చెప్పారు.
రెండున్నర ఎకరాల భూమిని ఎమ్మెల్యే ద్వారంపూడి సహాయంతో భూకబ్జాకు పాల్పడుతున్నారని చేసిన కొండబాబు వ్యాఖ్యలపై శివప్రసన్న స్పందించారు.
ద్వారంపూడి నగర ప్రజా మన్ననలను పొందుతున్నారని ఆయనకు అవినీతి మరకలు అంటించడం కొండబాబుకు తగదన్నారు. సుమారు రెండు ఎకరాల స్థలం కబ్జా చేస్తున్నట్లు ద్వారంపూడిపై వనమాడి చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టి పారేశారు. ఏసిపి హరిదాస్ మేయర్ శివ ప్రసన్న సమక్షంలో వివరణ ఇచ్చారు. కాకినాడ నగరంలోని సురేష్ నగర్ పార్కులో ఉన్న రెండు ఎకరాల స్థలం ఒక ప్రైవేటు వ్యక్తులను నివేదిక ఇవ్వడంతో అది ప్రైవేట్ వారిదిగానే గుర్తించారన్నారు. అధికారులు అది ప్రైవేట్ స్థలం అని గుర్తించడంలో అలసమైందన్నారు. దీనిపై టిడిఆర్ బాండ్లను ఇంకా ఎవరికీ ఇవ్వలేదని ఆమోదం నిమిత్తం కంట్రీ ప్లానింగ్ శాఖకు పంపినట్లు చెప్పారు.
ఈ సమావేశంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి డిప్యూటీ మేయర్లు చోడుపిల్లి ప్రసాద్, మీసాల ఉదయకుమార్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment