శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క పనిని ప్రారంభించే నిబద్ధతగల ప్రభుత్వం తమది



నెల్లూరు, జూలై 30 (ప్రజా అమరావతి): కేవలం శంకుస్థాపనలు చేసి మరచిపోయే ప్రభుత్వం తమది కాదని, శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క పనిని ప్రారంభించే నిబద్ధతగల ప్రభుత్వం తమద


ని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 శనివారం సాయంత్రం పొదలకూరు మండలంలోని పులికల్లు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  సుమారు కోటి రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో నిర్మించిన సైడ్ కాలవలు, సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. 

 అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు చేసిన మంత్రి గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించి వారికి ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలను వివరించి, అర్హత ఉండి ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు రావాలా, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా  అని అడిగి తెలుసుకున్నారు. 

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ అందాయా, లేదా తెలుసుకోవడం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, ఏ గడపకు వెళ్లిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తున్నామని, ఒక్క పొదలకూరు మండలంలోనే సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనులను మంజూరు చేయించుకున్నామని, పులికల్లు గ్రామపంచాయతీ లో రూ. 2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ 39 కోట్ల తో కండలేరు ఎడమ కాలువ లైనింగ్ పనులు మొదలయ్యాయని, మార్కెటింగ్ నిధుల నుంచి రూ 38 కోట్లతో మొగల్లూరు మీదుగా రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం శిలాఫలకాలు వేసిన పనులను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీ ప్రసాద్, మండల విస్తరణాధికారి శ్రీ నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి జి వెంకట సుబ్బమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments