పశ్చిమ గోదావరి జిల్లా (ప్రజా అమరావతి);
*ఆచంట మండలంలో పలు లంక గ్రామాల్లో గోదావరి వరద బాధితులను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు*
*చంద్రబాబు నాయుడు(టీడీపీ అధినేత):*
వరద ముంపు బాధితుల కష్టాలు తీవ్రం గా బాధించాయి.
ప్రజలను బురదలో ముంచేసి...సీఎం గాల్లో తిరుగుతున్నాడు.
వరద ముంపు బాధితులను ఆడుకోవడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది
1500 కిలోమీటర్లు గోదావరి ప్రయాణించి ఇక్కడికి వస్తుంది....కానీ వరదకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేదు.
బాధ్యత గల సీఎం అయితే ఇక్కడికి రావాలి.
ఇదొక దిక్కుమాలిన చెత్త ప్రభుత్వం.
1571 మందికి ఒక్క పడవ చొప్పున కేటాయించి తరలించారు. ఇదేనా సన్నద్ధత?
నేను వస్తున్నా అని ఇప్పుడు రెండు వేలు ఇచ్చారు.
కుటుంబానికి నాలుగు ఉల్లిపాయలు..నాలుగు మిరపకాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇది
కూరగాయలు, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు 10 వేలు ఇస్తుంది....ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు?
రెండు వేలు ఇచ్చే ప్రభుత్వానికి బుద్ది ఉందా?
అయోధ్య లంక ప్రాంతం లో ప్రభుత్వం రాగానే బ్రిడ్జి నిర్మిస్తాం.
ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించి మంచి నీరు ఇస్తాం
దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల సాయం చెయ్యాలి.
దద్దమ్మ సీఎం న్యాయం చెయ్యడం లేదని పోలవరం ముంపు గ్రామాలు తమను తెలంగాణలో కలపాలి అంటున్నారు.
దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది.... మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టారు.
దళితుల పథకాలు తీసేసి అన్యాయం చేశారు
addComments
Post a Comment