మెండు చక్రపాణి కి మహానటి సావిత్రి సేవా పరస్కారం

 మెండు చక్రపాణి కి   మహానటి సావిత్రి సేవా పరస్కారం


 


విజయవాడ, జులై 25 (ప్రజా అమరావతి):

సమాజ హితకారులు, వితరణశీలి, దేశ రాజధానిలో ఉంటూ తెలుగు వారికి అన్ని వేళలా అండగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి, ఇండియన్ రైల్వే  టెక్నీకల్ సర్వీసెస్  జీఎం  మెండు చక్రపాణి ని మహానటి సావిత్రి కళా పీఠం వారి సేవలను ప్రశంసిస్తూ "మహానటి సేవా పురస్కారం" తో ఘనంగా సత్కరించారు . ఈ మేరకు విజయవాడ ఐలాపురం హోటల్ లో సోమవారం జరిగిన ఒక  కార్యక్రమంలో  సీనియర్ జర్నలిస్ట్, పత్రికా సంపాదకులు, ఫార్మర్ ఆర్టిఐ కమిషనర్ , విజయ్ బాబు గారి చేతుల మీదుగా మహానటి సావిత్రి సేవా పురస్కారాన్ని కళాపీఠం నిర్వాహకులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ  సేవా భావానికి మరో నిర్వచనం మహానటి సావిత్రి అన్నారు.ఆమె పేర పురస్కారాన్ని సమాజ హితం కోరి నిరంతరం సామాన్యులకు అండగా నిలుస్తూ.. దేశరాజధాని ఢిల్లీలో ఉండి తెలుగువారి ఖ్యాతిని చాటి చెబుతున్న గొప్ప మహోన్నత వ్యక్తి మెండు  చక్రపాణికి మహానటి సావిత్రి సేవా పురస్కారంతో సత్కరించడం ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం నిర్వాహకులు బడే ప్రభాకర్, కోయ హరిమోహన్, సీనియర్ జర్నలిస్టులు   బద్దం సుమలత,టివి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Comments