*రాష్ట్రపతి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అబ్జర్వర్ చంద్రేకర్ భారతి*
*•ఏపి శాసన సభా ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లన్నింటినీ సూక్ష్మంగా పరిశీలించిన అబ్జర్వర్*
*•చేసిన ఏర్పాట్లను సమగ్రంగా వివరించిన స్టేట్ సి.ఇ.ఓ. ముకేష్ కుమార్ మీనా, ఏ.ఆర్.ఓ. కె.రాజ్ కుమార్*
అమరావతి, జూలై 17 (ప్రజా అమరావతి): ఈ నెల 18 న జరుగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబందించిన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, ఎన్నికల ప్రత్యేక అధికారి సంతోష్ అజ్మీరా ఆదివారం పరిశీలించారు. రాష్ట్రపతి ఎన్నిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అవసరమైన పలు సూచనలు, సలహాలను ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి అధికారులకు ఇచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభా ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చిన ఎన్నికల పశీలకులు చంద్రేకర్ భారతి మరియు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరాకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఛాంబర్ లో వారిరువురు కొంత సేపు సమావేశమై ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై ఆరాతీశారు. రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వారికి సమగ్రంగా వివరించారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ శాసన సభా ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వారంతాకలిసి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభా ప్రాంగణంలో రాష్ట్ర పతి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు కె.రాజ్ కుమార్, వనితా రాణి వారి సాదర స్వాగతం పలికారు.
ఓటర్లకు తెలియపర్చే విధంగా ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన ఓటర్లకు సూచనలు, కోవిడ్ జాగ్రత్తలు, ఫార్ము-5 నమూనా మరియు ఇతర ముఖ్య సూచనల ఫ్లెక్సు బ్యానర్లను ఎన్నికల పరిశీలకులు పరిశీలించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా శానిటైజర్, మాస్కులు ఎక్కడ పెట్టారంటూ ఆరాతీస్తూ ప్రవేశ ద్యారం లోపల వాటిని ఉంచి చోటికి వెళ్లి పరిశీలించారు. శాసన సభా భవనం మొదటి అంత్తసులోని 203 మరియు 205 గదుల్లో ఏర్పాటు చేసిన ఓటర్లు వేచిఉండే గదులను ఆయన పరిశీలించారు. ఆయా గదుల్లో కూడా ఓటర్ల సూచనల ప్లెక్సు బ్యానర్లను, కరపత్రాలను ఏర్పాటు చేయాలని ఏ.ఆర్.ఓ. కె.రాజ్ కుమార్ కు ఆయన సూచించారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్ల బాక్సులను భద్రపర్చిన 258 వ స్ట్రార్ రూమ్ వద్దకు వెళ్లి ఆగదికి వేసిన సీళ్లను, అక్కడుంచిన రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఆ స్ట్రాంగ్ రూమ్ ను భద్రతా సిబ్బంది ఏవిధంగా పహరాకాస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మొదటి అంత్తసులో పోలింగ్ కేంద్రానికి ఎదురుగా ఏర్పాటు చేయబడిన ఓటర్లకు స్టిప్స్ జారీచేసే కౌంటర్ను ఆయన పరిశీలించారు. స్లిప్స్ జారీచేసే విధానంలో ఎన్నికల సిబ్బంది అనుసరిస్తున్న పక్రియను ఆయన అడిగి తెలుసుకుని, స్లిప్స్ జారీచేయు పక్రియ మరింత పటిష్టంగా అమలు పర్చేందుకు అనుసరించాల్సిన విదానాలను వారికి తెలియజేశారు. అనంతరం 201 కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, పోలింగ్ కంపార్టుమెంట్ ను ఆయన సందర్శించారు. పార్టీల ఏజంట్లపై ఆయన ఆరాతీస్తూ వారి వివరాలను ఎన్నికల సంఘం నుండి వెంటనే కనుక్కొని వారి పేర్లను తెలుసుకొని, వారు కూర్చునేందుకు తగు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక ప్రక్రియను ఏవిధంగా వీడియోగ్రఫీ మరియు ఫొటోగ్రఫీ చేస్తున్నారో అధికారులను అడిగితెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి నిర్థిష్ట విరామాల్లో పరిమిత సంఖ్యలో వీడియోగ్రాఫర్లను ఏవిధంగా అనుమతిస్తున్నదని మరియు వారు వచ్చివెళ్లే మార్గాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆంద్రప్రదేశ్ శాసన సభ మరియు శాసన మండలి భవనాల స్కెచ్ లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలను, మార్గాలను, పటష్టమైన భద్రతకై అధికారులు తీసుకున్న చర్యలను ఆయన పరిశీలించారు. తదనంతరం కంట్రోల్ రూమ్ ను ఆయన సందర్శించి అక్కడ చేసిన సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మరో కమిటీ హాల్ లో అధికారులు అందరితో ఆయన సమావేశమై మరింత సమగ్రంగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ సమయంలో ఎటు వంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ జనరేటర్లను సిద్దంగా ఉంచుకోవాలని, ఎన్నికల ప్రక్రియను అంతా వీడియోగ్రఫీచేయించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు సంబందించిన డ్యూటీ చార్టును పటిష్టంగా రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు.
డిప్యూటీ సీఈఓ వెంకటేశ్వరావు, అసిస్టెంట్ సీఈఓ శ్రీనివాస శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి ఉప కార్యదర్శులు మరియు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు కె.రాజకుమార్, వనితా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment