శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

     ఈరోజు ఉదయం బ్రాహ్మణ వీధి,  జమ్మిదోడ్డి నందలి దేవతామూర్తుల వద్ద ఆలయ స్థానాచార్యుల వారు మరియు ప్రధానార్చకుల ఆధ్వర్యంలో శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు,  ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, పర్యవేక్షకులు, సెక్యురిటి, శానిటేషన్ మరియు ఇతర సిబ్బంది విశేషముగా పాల్గొన్నారు. జమ్మిదోడ్డి నందలి దేవతామూర్తుల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు మరియు సిబ్బంది జమ్మిదోడ్డి నుండి ఊరేగింపుగా వివిధ రకముల పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లు, సలివిడి మరియు ఇతర వంటకములతో  మంగళ వాయిద్యాల నడుమ బయలుదేరి కాలినడకన శ్రీ అమ్మవారి ఆలయము చేరుకున్నారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. అనంతరం మహామండపం 06 వ అంతస్తు చేరుకోగా శ్రీఅమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేయడం జరిగినది.

Comments