*ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పవన్ కళ్యాణ్*
విజయవాడ, (ప్రజా అమరావతి): జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు అందిస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భీమవరంలో జూలై 17వ తేదీ జనవాణి నిర్వహిస్తామని పవన్ తెలిపారు.*
*పవన్‌కు అర్జీ ఇచ్చిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు*
*పవన్‌కు విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. మధ్యవర్తి విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల వేళ జగన్ హామీ ఇచ్చారని, దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
addComments
Post a Comment