శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు దేవస్థానం నకు చెందిన అన్నదాన విభాగం ట్రస్ట్ సిబ్బంది శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో శ్రీయుత ఆలయ కార్యనిర్వహణ అధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు పాల్గొని, అన్నదానం కార్యాలయము నందు ఉన్న దేవతామూర్తుల వద్ద దీప ప్రజ్వలన చేసి, పూజలు నిర్వహించి, టెంకాయలు కార్యక్రమమును ప్రారంభించారు. అన్నదానం ట్రస్టు సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా శ్రీ అమ్మవారి దేవస్థానం నకు చేరుకోగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొని శ్రీయుత కార్యనిర్వహణాధికారి వార్ల చేతుల మీదుగా శ్రీ అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు శ్రీ పి.చంద్రశేఖర్ గారు, సుధారాణి గారు, పర్యవేక్షకులు శ్రీ కె వి దుర్గా ప్రసాద్ గారు మరియు అన్నదాన విభాగం సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మహా మండపం ఆరో అంతస్తు నందు ఉన్న శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద పూజలు నిర్వహించారు.
addComments
Post a Comment