నెల్లూరు, జూలై 23 (ప్రజా అమరావతి): గతంలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సి వచ్చేద
ని, ఆ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జున పురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ఆ ఇంటికి అందిన సంక్షేమ పథకాలను వివరించి, అర్హత ఉండి ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు అందాలా అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా, వార్డు కౌన్సిలర్ నుంచి మంత్రి స్థాయి వరకు ప్రతి గడప కు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే వినూత్న కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వం అని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వంలో తాను శాసనసభ్యునిగా పని చేసినప్పుడు అనేక సమస్యలతో ప్రజలు తన వద్దకు వచ్చే వారిని, అందరి సమస్యలు పరిష్కారం అయ్యేవి కావని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సచివాలయాల ద్వారా వారి ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఏ గడపకు వెళ్లిన ప్రజలందరూ తమకు అందిన సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోయినా, గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు సమకూర్చాల్సి వచ్చినా, వాటన్నింటిని తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీమతి హైమావతి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీ శ్రీనివాస రెడ్డి, సర్పంచ్ కల్లూరి ఇంద్రసేన, మండల వ్యవసాయాధికారి శ్రీమతి గీతా కుమారి, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment