నరసాపురం (ప్రజా అమరావతి);
వరద ప్రభా ప్రాంతాలలోని అన్ని కుటుంబాలు నూటికి నూరు శాతం ప్రభుత్వ సహాయం అందించడం జరుగుతుందని వరద ఉపశమన, పునరావాస ప్రత్యేక అధికారి శ్రీ ప్రవీణ్ కుమార్ తెలిపారు..
బుధవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు ప్రతి ఇంటికి 2,000 రూపాయల చొప్పున వరద ప్రాంతాలలోని 6,587 మందికి 1.16 కోట్లు రూపాయలు వారి ఆన్లైన్ అకౌంట్లో జమచేయవలసి ఉండగా ఇప్పటి వరకు 4,549 మందికి 80 లక్షల 75 వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని ,ఇంకా 1670 మందికి 30 లక్షల రూపాయలు వారి బాంక్ అకౌంట్ లో జమచేయాలని , ఈరోజు సాయంత్రం వరకు వాటిని కూడా ఆన్లైన్లో వారి అకౌంట్ కు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాలలోని ఏ ఒక్కరి కుటుంబానికి డబ్బులు మిస్ కాకుండా చర్యలు తీసుకున్నామని , డబ్బులు వేసిన తర్వాత వాలంటీర్లు , విఆర్వోలు , తహ శీ ల్దార్ లు , ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి డబ్బులు చేరినాయా ? లేదా అని తనిఖీలు చేయడం జరుగుతాదని ఆయన తెలిపారు. సోషల్ ఆడిట్ చేసి ప్రతి గ్రామంలోనూ కూడా డబ్బులు వేసిన వారి జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని ఆయన తెలిపారు.గ్రామాలలోని 6,587 కుటుంబాలకు గాను 1599 కుటుంబాలు వరద నీటిలో ఉండగా వీరికి వరద నీరు తగ్గిన తరువాత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 4,988 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు,కేజీ కందిపప్పు , కేజీ ఆయిల్ ,కేజీ ఉల్లిపాయలు , కేజీ బంగాళాదుంపలు , బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. 92.14 శాతం పంపిణీ పూర్తి చేయడం జరిగిందని అన్నారు.ఈ రొజు 392 మందికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఆరు గ్రామాలు మినహా మిగిలిన అన్ని గ్రామాలలో నీరు తగ్గిపోయిందని ఆరు గ్రామాలలోని 1599 మందికి వాటర్ తీసిన తర్వాత నిత్యవసర వస్తువులు పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని గ్రామాలలో ప్రస్తుతం టిఫిన్ , భోజనము , వాటర్ నిరంతరాయంగా సరఫరా చేయడం జరుగుతుందని వరద సహాయక పునరావాస ప్రత్యేక అధికారి తెలిపారు.
నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి గోదావరి ఏటిగట్టు తాత్కాలిక పునరుద్ధరణకు 58 లక్షలు రూపాయలు మంజూరు చేయడం జరిగిందని దీనిని రెండు వారాల లోగా పూర్తి చేయడం జరుగుతాదని ఆయన తెలిపారు. పూర్తిస్థాయిలో శాశ్వతంగా బలోపేతం చేయడానికి 17 కోట్ల రూపాయలు తో పనులు చేపట్టి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో శానిటేషన్ పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయని, గ్రామాలలో పేరుకుపోయిన సిల్ట్, గార్బేజ్ ను మిషనరీని వినియోగించుకొని 48 గంటల్లో తొలగించే పనులు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడం పైపులైన్లు క్లియర్ చేయడం , మోటార్లు రిపేరు చేసి , పరిశుభ్రమైన మంచినీరు అందించే విధంగా పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మెడికల్ క్యాంపులు నిర్వహించదాంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయడం జరుగుతుందని ,ఎవరికైనా ఎటువంటి లక్షణాలు ఉన్న వెంటనే చికిత్స చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో పూర్తిస్థాయిలో వరద నీరు తొలగిన తర్వాత ఎన్యూమురేషన్ చేయడం జరుగుతుందని దాని ప్రకారంగా ఏ పంట ఎన్ని ఎకరాలు నష్టం జరిగింది, ఎన్ని ఇల్లు పూర్తిగా డ్యామేజ్ అయినవి , ఎన్ని ఇల్లు పాక్షికంగా డామేజ్ అయినవి ఏన్ని వివరాలు తెలుస్తాయని శ్రీ ప్రవీణ కుమార్ అన్నారు.
ఈ పత్రిక విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి , జాయింట్ కలెక్టర్ శ్రీ జె వి మురళి ,సబ్ కలెక్టరు సి.విష్ణు చరణ్ పాల్గొన్నారు.
addComments
Post a Comment