సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు*
*ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సరైన సమయంలో పరిష్కరించండి*
సోమందేపల్లి మండలంలో ప్రధాన కేంద్రం లో 1 మరియు 3వ గ్రామ సచివాలయం ని , మరియు తు0గోడుఆకస్మికంగా తనిఖీ చేశారు
తుంగోడు రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
సోమందపల్లి, జూలై, 26 (ప్రజా అమరావతి):-ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సరైన సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు*
మంగళవారం సోమందేపల్లి మండలంలో ప్రధాన కేంద్రం లో 1మరియ 3వ గ్రామ సచివాలయం ని మరియు తు0గోడు గ్రామ సచివాలయం నిఆకస్మికంగా తనిఖీ చేశారు
తుం గోడు రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు
ఆయా గ్రామ సచివాలయంలో ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు*.
*సచివాలయానికి వచ్చే వాలంటీర్లు తప్పకుండా బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది విధుల యందు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు ప్రజలతో మమేకమై వారికి నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. వర్ష కాలం ప్రారంభమైంది గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో అందుతున్న సర్వీసులను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి సచివాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయా గ్రామ సచివాలయానికి వచ్చిన ప్రజలకు తెలియజేశారు వచ్చిన దరఖాస్తులను స్వీకరించి నిజంగ అరహత కలిగిన వారు ఉంటే వారి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు,
సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేసి కన్సిస్టెంట్ రిథమ్ (Consistent Rhythm) అనే యాప్ లో పిల్లల, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను నమోదు చేయాలన్నారు.. హెడ్మాస్టర్ లాగిన్ లో ఉన్న వివరాలను పరిశీలించి, సమస్యలు ఏవైనా ఉంటే, వాటిని పరిష్కరించి నివేదికను అప్లోడ్ చేసే విధంగా సిబ్బందిని ఆదేశించారు. గ్రామ సచివాలయం ద్వారా500 ల కు పైగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు అందించాలని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
రైతులకు నాణ్యమైన సేవలు అందించాలి
తుం గోడు రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ ఉత్పత్తులు. మార్కెట్ ధరలు, నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు మార్కెట్ కు సంబంధించిన ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు రైతులకు ఈ కేంద్రం ద్వారా సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు,
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మురళి కృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఈ ఓ పి ఆర్ డి నాగరాజ రావు, గ్రామ సచివాలయ సెక్రటరీలు ఆర్ చక్రవర్తి, నాగ ముని, సావిత్రి, రైతు భరోసా కేంద్రం సిబ్బంది కే కవిత, కవితా రాణి తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment