తాడేపల్లి (ప్రజా అమరావతి);
*ఆర్టీసీ చార్జీలు తగ్గించేంతవరకు పోరాటం
*
*రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ చార్జీలు తక్షణమే తగ్గించాలి.*
*టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు డిమాండ్*
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడిని బాధటమే పనిగా పెట్టుకున్నారని టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు విమర్శించారు.ఆదివారం తాడేపల్లి స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికీ మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని ఆరోపించారు. ఆర్టీసీ చార్జీలు నిత్యవసర ధరల పెంపు పన్నుల బాదుడితో రాష్ట్రంలో సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదని అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పలువురు నేతలు మాట్లాడుతూ పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శిదారాదాసు,
ఉపధ్యక్షులు సిహెచ్ శివుడు, మహిళా అధ్యక్షురాలు అన్నెం కుసుమ ,మంగళగిరి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఇట్టా భాస్కర్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కె.అంజిరెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ అడపా నరేష్,టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్,
పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి ఢిల్లీ రామారావు ,మండవ గోపాలరావు ,అద్దంకి మురళి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment