ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ)
కమిషనర్ వారి కార్యాలయము, లెనిన్ సెంటర్, విజయవాడ (ప్రజా అమరావతి);
కరకట్ట రహదారి పనులు వేగంగా చేపట్టండి:
సమీక్షలో అధికారులకు ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ఆదేశాలు
అమరావతి ప్రాంతానికి సువిశాలమైన రవాణా మార్గంగా కృష్ణానది కరకట్ట మార్గాన్ని తయారచేయాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ) కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్., వారు సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు ఎత్తిపోతల వంతెనకు ప్రత్యామ్నాయంగా మరొక వంతెనను నిర్మించనున్న తరుణంలో సెంట్రల్ ఇరిగేషన్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నూతన వంతెనకు అందించిన డిజైన్పై మంగళవారం ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో నీటిపారుదల, ఏపీసీఆర్డీఏ, ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్ష జరిపారు. 1.6 మేర నిర్మాణం జరుగుతున్న కృష్ణా కరకట్ట పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ప్రముఖులు రాకపోకలకు ప్రధాన మార్గమైనందున ఆకర్షణీయమైన విద్యుత్తు దీపాలను ఇతోదికంగా చేపట్టాలన్నారు. కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద ప్రస్తుతం ఉన్న ఒకలైను వంతెన కారణంగా వాహనాలు ఎదురెదరు పడినప్పుడు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవటంతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఉన్నత న్యాయస్థానం లాంటి ప్రధాన ప్రదేశాలకు వెళ్లే వారి ప్రయాణ సమయం అధికమవుతుందన్నారు. ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా నిర్మించనున్న నూతన వంతెన ద్వారా ట్రాఫిక్ అవాంతరాలను నివారించవచ్చన్నారు. పది మీటర్ల విస్తీర్ణంలో రెండు లైన్లుగా నిర్మించనున్న ఆధునిక వంతెన డిజైన్లను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. వంతెన నిర్మాణ క్రమాన్ని నీటిపారుదలశాఖ అధికారులు కమిషనర్ వారికి నివేదించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీసీఆర్డీఏ, ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు ఎన్.వి.ఆర్.కె.ప్రసాద్, కె. రాజేంద్రప్రసాద్, నీటిపారుదల, ఏడీసీ సూపరింటెండింగ్ ఇంజినీర్లు తిరుమలరావు, కె.రామ్మోహనరావు, డిఈఈ ఎం.గోవిందయ్య, మెగా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment