కన్నాయిగుట్ట, తిరుమలాపురం
వేలేరుపాడు మండలం
పోలవరం నియోజకవర్గం, ఏలూరు జిల్లా (ప్రజా అమరావతి);
*ఆర్ అండ్ ఆర్ చెల్లించాకే నిర్వాసితుల తరలింపు
*
*చెల్లింపులు చేసిన ప్రాంతాల మేరకే నీటి నిల్వ*
*నిర్వాసితులకు ముఖ్యమంత్రి విస్పష్టహామీ*
*కేంద్రం ఇచ్చేలోగా 41.15 మీటర్ల స్థాయి వరకూ ఉన్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వంనుంచే చెల్లింపులు*
*ప్రాజెక్టు ఆలస్యంకాకుండా, ముంపు ప్రమాదం లేకుండా చేయడానికి అడుగులు ముందుకేస్తున్నాం*
*పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నింపాలంటే కేంద్రం సహాయం తప్పనిసరి*
*మరోసారి ప్రధానిని కలిసి పరిస్థితులను వివరిస్తా*
*ఆలస్యంకాకుండా పోలవరం నిధులకోసం ఒత్తిడి తెస్తా*
*నిర్వాసితులతో సీఎం*
*తిరుమలాపురం వద్ద నిర్వాసిత గ్రామాల ప్రజలతో మాట్లాడిన సీఎం*.
*సీఎం ఏమన్నారంటే*:
– వరద వచ్చినప్పుడు లేదా వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇంత పారదర్శకంగా, ఈస్థాయిలో ఎప్పుడూ జరగలేదు.
ఏకంగా కలెక్టర్లే ఇక్కడ తిష్టవేశారు.
గతంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉండేవి. ఇద్దరే కలెక్టర్లు ఉండేవారు.
ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు ఉన్నారు.
దీనికి తోడు గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థకూడా అందుబాటులో ఉంది.
అందర్నీకూడా సహాయ కార్యక్రమాలకోసం మోహరించాం.
ఎవ్వరికీ మిస్‌కాకూడదనే తపన, తాపత్రయంతో పనిచేశారు.
పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో మమేకం అయ్యారు.
ఎవ్వరిని అడిగినా సరే మాకు 25 కేజీల రేషన్‌తో పాటు రావాల్సినవన్నీ వచ్చాయని చెప్పారు.
వీటితోపాటు ప్రతి కుటుంబానికి కూడా రూ.2వేల చొప్పున అందాయి అని సగర్వంగా చెప్పుకునేలా ఒక వ్యవస్థ ఇప్పుడు పనిచేస్తోంది.
ఇలా గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు.
మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు కాబట్టి, ఎన్యుమరేషన్‌కూడా ఇవాళే మొదలుపెట్టమని చెప్పాం:
పంటనష్టం జరిగినా, ఇంటికి నష్టం చోటుచేసుకున్నా.. వారికి పరిహారం చెల్లిస్తాం.
తాటాకు ఇళ్లు ధ్వంసమైతే పరిహారం నిబంధనల ప్రకారం రూ.4వేలు ఉంటే.. దాన్ని రూ.10వేలకు పెంచాం.
పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయమని చెప్పాం.
ఎన్యుమరేషన్‌ను 14 రోజుల్లో పూర్తిచేయమని చెప్పాం.
ఇది చేసిన తర్వాత జాబితాను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం ప్రదర్శిస్తారు.
ఎవరి పేరు అయినా పొరపాటున లిస్టులో లేకపోతే వాళ్లు 14 రోజుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
దీనితర్వాత తదుపరి 14 రోజుల్లో రీ వెరిఫికేషన్‌చేసి తుది జాబితా పెడతారు.
మొత్తంగా 6 వారాల్లో తుది జాబితా తయారు అవుతుంది.
ఇది జరిగిన తర్వాత 2 వారాలు నాకు సమయం ఇవ్వండి, జరిగిన నష్టానికి పరిహారం ఇస్తాం.
సీజన్‌లో నష్టం జరిగితే, అదే సీజన్ ముగియకముందే వారికి ఇన్‌పుట్‌సబ్సిడీ రూపంలో అండగా నిలబడతాం.
వీలైనంత త్వరగా ఆర్ అండ్ ఆర్ అమలు చేయాలన్న భావనలో ఇక్కడవారంతా ఉన్నారు.
నిర్వాసితులవుతున్న వారందరికీ కూడా వినయపూర్వకంగా కొన్ని విషయాలను చెప్పలుచుకున్నాను.
తప్పనిసరిగా ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాను.
పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అంటే 45.72 మీటర్ల
స్థాయివరకూ నీటిని నింపాలి అంటే కేవలం ఆర్ అండ్ ఆర్‌కే దాదాపుగా మరో రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుంది.
రూ. 500 కోట్లో, రూ.1000 కోట్లో, లేకపోతే రూ.2వేల కోట్లో అయితే కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ చెల్లింపులు కేంద్రం ఆలస్యంచేసినా, మన ప్రభుత్వమే సొంతంగా ఆర్ అండ్ ఆర్ ఇచ్చేసేది.
ఒకేసారి రూ. 20వేల కోట్లు ఇవ్వాలంటే.. జగన్‌కూడా సరిపోవడం లేదు. (రాష్ట్ర ప్రభుత్వం సరిపోవడంలేదు)
అందుకనే కేంద్రం నుంచి వచ్చే సహాయంపైన తప్పకుండా ఆధారపడాల్సిన పరిస్థితి.
అందుకనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్రం ద్వారా సహాయం పొందడానికి అన్నిరకాలుగా ప్రయత్నంచేస్తున్నాం.
ఈ సెప్టెంబరు కల్లా పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లు స్థాయివరకూ నిర్వాసితులు ఎవ్వరినీ కూడా విడిచిపెట్టకుండా అందరికీ ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇస్తాం.
ఈమేరకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం అయినాకూడా చేస్తాం.
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2900 కోట్ల రూపాయలను కేంద్రం చెల్లించాల్సి ఉంది.
కాని ఇక్కడ రివర్స్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సాధారణంగా అయితే కేంద్రం మనకు డబ్బు ఇస్తే.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆడబ్బును మనం ఖర్చుచేయాల్సి ఉంటుంది. కాని అలాకాకుండా.., రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.2900 కోట్లు ఖర్చుచేసింది. ఆడబ్బును కేంద్రం నుంచి ఇప్పించుకోవడంకోసం చాలాచాలా కష్టపడాల్సి వస్తోంది.
స్వయంగా నేను ఈ అంశంపై ప్రధానమంత్రిగారిని పలుమార్లు
కలిశాను. దీనిపై కేంద్ర జలవనరులశాఖ, ఆర్థిక మంత్రులను రాష్ట్ర మంత్రులు పలు దఫాలుకలిసి విజ్ఞాపనలు చేశారు. ప్రతినెలాకూడా మిస్‌కాకుండా వారిని కలిసి వినతులు ఇస్తూనే ఉన్నారు.
ఆశించినంత రీతిలో వారినుంచి కదలిక రావడంలేదు. కేంద్రంలో ఆ కదలిక వచ్చేందుకు గట్టిగా ప్రయత్నంచేస్తున్నాం.
కేంద్రం నుంచి రావాల్సిన ఆ రూ.2900 కోట్లు ఆలస్యం అయినా, ఇంకేమైనా జరిగినా సరే.., పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయి వరకూ సంబంధించిన ఆర్ అండ్ ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా పూర్తిచేస్తాం.
పోలవరం నిర్వాసితులకు సంబంధించి గతంలో నేను ఒక హామీ ఇచ్చాను.
నాన్నగారి హయాంలో రూ.1.10లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకూ ఇచ్చారు. వారికి మరో రూ.3.5 లక్షలు ఇచ్చి మొత్తంగా రూ.5లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాను.
నిర్వాసితులను తరలించే సమయానికి ఆ డబ్బునుకూడా వారిచేతిలో పెడతాను.
పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 45.72మీటర్ల కు చేరుకోవాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది.
దానికోసం కూడా గట్టిగా ప్రయత్నంచేస్తాం.
కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్తాం.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే ప్రకటించింది.
ఇలా ప్రకటించిన తర్వాత వాళ్లు ఆపగలిగిందికూడా ఏమీ ఉండదు.
ఇవాళ కాకపోయినా రేపైనా కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ ఇచ్చేది ఈరోజే ఇచ్చేస్తే.. ప్రజలు సంతోషంగా ఉంటారన్న విషయాన్ని వారికి అర్థం అయ్యేలా చెప్తాం.
ఆర్ అండ్ ఆర్ ఆలస్యం చేసేకొద్దీ నష్టం కేంద్ర ప్రభుత్వానికే అన్న విషయాన్ని వారికి తెలియజేస్తాం.
ఆలస్యం అయితే ఆర్ అండ్ ఆర్ కింద చెల్లించే మొత్తం పెరుగుతూ పోతుంది.
2013 చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్‌కోసం జారీచేసే నోటిఫికేషన్ జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే.
ఈ విషయాలన్నీ కూడా వారికి వివరించి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.
పోలవరంలో కేంద్రం పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర.
మీ అందరికీ మరో విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా..,
ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని ఎంతవరకూ ఇస్తారో, ఆస్థాయివరకే డ్యాంలో నీటిని నింపుతాం. అంతకన్నా ఎక్కువ నింపే పరిస్థితి ఉండదని స్పష్టంచేస్తున్నాం.
ఈ అంశాలను అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది.
ప్రతి పనిని మనం చిత్తశుద్ధితో చేస్తున్నాం.
ఎప్పటికైనా న్యాయం జరక్కుండా ఉండదు.
ప్రధానమంత్రి మోదీగారి అపాయింట్‌మెంట్ అడిగా.
నేను చూసిన పరిస్థితులన్నింటినీ ఆయనకు వివరిస్తా.
ఏరోజైనా ఇవ్వక తప్పదు కదా సర్.. ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే.. వారంతా సంతోషిస్తారు, నిర్వాసితులు మిమ్మల్నే తలుచుకుంటారనే విషయాన్ని ప్రధానమంత్రికి వివరిస్తా.
బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖతాల్లో ఆయన్నే పంపమని కోరుతా. ఆయన్ని ఒప్పించే ప్రయత్నంచేస్తాను.
ప్రజల విజ్ఞప్తులపై స్పందిస్తూ:
నిర్వాసితులుగా గుర్తించడంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో లోపాలు ఉంటే వాటిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటాను: సీఎం
సర్వే కూడా పూర్తయింది. సర్వేను పరిగణలోకి తీసుకుని ఎవరు ఏ కాంటూరులోకి వస్తారో మళ్లీ పరిశీలన చేస్తాను:
పోలవరం విద్యుత్ ప్రాజెక్టులో నిర్వాసితులకు లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉపాధికల్పించేలా చూడాలి: సీఎం.
addComments
Post a Comment