సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొత్త చరిత్ర !! --- మంత్రి జోగి రమేష్


 మచిలీపట్నం : 22 జూలై  (ప్రజా అమరావతి); 


సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొత్త చరిత్ర  !!

      ---  మంత్రి జోగి రమేష్ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.    

              

           రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 1 వ వార్డు, 23 వ వార్డులో శుక్రవారం ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణంలో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా ప్రతి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు నేరుగా ఆయన వద్ద నుంచి వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా సంక్షేమం కోసం పాటు పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, మీకు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని దీవిస్తున్నారు.


        తొలుత పెడన కొత్తపేట ( 1 వ వార్డు ) లో మెట్ల జ్ఞాన కోటేశ్వరి, దావు ధనలక్ష్మి, నున్నా  వీర కోట లక్ష్మి, నున్నా శ్యామలమ్మ, రాసాబత్తిన ఆదినారాయణ, పిచ్చుక వీర రాఘవమ్మ, కొసనం నాగేంద్రం, శ్రీకాకుళపు భాస్కరరావు, ఆరెపల్లి గంగా భవాని, సింగనపూడి మహిమ కుమారి, మానికొండ వీర రాఘవమ్మ, వీరవరపు కుమారి, దోరా జీవన, దావు భూలక్ష్మి  తదితరుల ప్రతి ఇంటికి మంత్రి జోగి రమేష్ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా అని పలువురు లబ్ధిదారులను పేరు పేరున పలకరిస్తూ అడిగి తెలుసుకున్నారు. 


           ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ,  ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింద‌న్నారు. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశారన్నారు.  అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడద‌న్న‌దే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వ సంకల్పమమ‌ని మ‌రోసారి మంత్రి స్పష్టం చేశారు ఏయే ప‌థ‌కాల‌తో ఎవరెవరు ఎంత ల‌బ్ధి పొందారో వివ‌రిస్తూ, ముఖ్యమంత్రి  వైఎస్ జ‌గ‌న్ స్వ‌త‌హాగా రాసిన లేఖ‌ను, న‌వ‌ర‌త్నాల బుక్‌లెట్‌ను అందించారు.  ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ సహాయాన్ని తెలియ చేస్తూ, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆయన  ముందుకు సాగారు. ఆయన సందర్శిస్తున్న ప్రతీ గడపలో ప్రజలను పేరు పెట్టీ మరీ పలకరిస్తూ,  ప్రభుత్వం అందిస్తున్న మన అందరి పాలనకు మద్దతుగా ఫోన్ నంబర్ 8296082960 కి మిస్డ్ కాల్  చేయించారు. 

             

         ఈ కార్యక్రమంలో  పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, 1 వ వార్డు  కౌన్సిలర్ బళ్లా పద్మావతి సూర్య చంద్రరావు,  3 వ వార్డు కౌన్సిలర్  బళ్ళా గంగయ్య, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, హోసింగ్ డి ఈ  ఏ శ్రీనివాసరావు , హ్యాండ్లూమ్, టెక్స్టైల్ డెవలోప్మెంట్ అధికారి  కె. సూరిబాబు,  టౌన్ ప్లానింగ్ అధికారి ఏసుబాబు , ఇంచార్జ్ మండల విద్యాశాఖాధికారి కె. ఎస్. వి. ప్రసాద్, మునిసిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ గడడేశీ మోహన్ కుమార్,  వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, ఆహార సలహా కమిటీ ఛైర్మెన్ హనీఫ్ ఖాన్,  స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు  తదితరులు పాల్గొన్నారు. 


Comments