రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలిస్తోంది.

 అల్లూరి జిల్లా (ప్రజా అమరావతి);

*ఎటపాక మండలంలో పలు గ్రామాల్లో గోదావరి వరద బాధితులకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శ*

*అంతకు ముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న టిడిపి అధినేత*

*భద్రాచలం కరకట్టను సందర్శించిన చంద్రబాబు నాయుడు*

*నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం:-*

రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలిస్తోంది.


రాష్ట్రంలో పలానా ప్రదేశంలో పిడుగు పడుతుంది అనే హెచ్చరికలు చేసే వ్యవస్థ కూడా ఎపిలో తీసుకువచ్చాం.

అయితే ఇప్పుడు గోదావరి వరద వస్తే హెచ్చరించే వ్యవస్థ కూడా లేదు.

తోటపల్లిలో పిడుగు పాటుకు గురై చనిపోయిన శ్రీదేవి కుటుంబానికి అండగా ఉంటాం.

ఇంత వరద కష్టం వస్తే....ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు ఎలా సరిపోతుంది.

వరదలు వస్తే సిఎం జగన్ గాల్లో తిరిగాడు...10 కిలోమీటర్లకు కూడా జగన్ హెలికాఫ్టర్ ఎక్కాడు.

ప్రజల కోసం కష్టమైనా పలకరించాలని బాధ్యతతో ఇంత దూరం వచ్చాను.

వరదలు వచ్చినప్పుడు సిఎంకు ప్యాలెస్ లో ఏం పని

25 మంది ఎంపిలు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాను అన్నాడు...ఇప్పుడు మెడలు దించాడు

పోలవరం కట్టలేను...పరిహారం ఇవ్వలేను అని జగన్ తేల్చేశాడు.

జగన్ ఏం చేశాడని 175 కు 175 సీట్లు ఇస్తారు.

జగన్ ప్రభుత్వానికి జనం నెగటివ్ మార్కులు వేస్తారు.

వైసిపి ఎంపిలు రాజీనామాలు చేస్తే పోలవరం పరిహారం వస్తుంది.

ఎంపిల రాజీనామాలు చెయ్యడానికి జగన్ సిద్దమేనా

రోడ్డు కూడా లేని పాడేరులో జిల్లా కేంద్రం పెట్టారు.

పోలవరం ముంపు ప్రాంతాల వారు పాడేరు ఎలా వెళతారు.

జిల్లా కేంద్రం కంటే అమరావతి, హైదరాబాద్ ఈ ప్రాంతం వాళ్లకు దగ్గర

పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి

పోలవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలు జీవితాల్లో వెలుగు తీసుకువస్తా.

ప్రజలు ట్రాక్ రికార్డు చూసి నేతల్ని ఎన్నుకోవాలి

దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు

డ్రైవింగ్ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైంది

పోలవరం ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ కింద జగన్ ఇస్తాను అని చెప్పిన రూ.10లక్షలు ఎందుకు ఇవ్వలేదు.

ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తాను అన్నారు...ఇచ్చారా?

జగన్ కు ఉన్నది ఒకటే లక్ష్యం....తన కేసుల నుంచి బయట పడాలి.

వరద బాధితులకు 4ఉల్లిపాయలు, 4టమోటాలిచ్చి అన్ని సమస్యలు తీర్చేశానని జగన్ రెడ్డి చెప్తున్నారు.

ఇంట్లో ఇద్దరున్నా, అయిదుగురు ఉన్నా ఒకే తరహా సాయం అందించటం ఎక్కడి న్యాయం

వరద ప్రాంతాల్లో సీఎం ప్రజలపై ప్రేమతో రాలేదు, మొక్కుబడిగా వచ్చి వెళ్ళాడు

గోదావరి వరదతో ఇళ్లలో ఫ్యాన్ కి 2అంగుళాల బురద పట్టి పనిచేయకుండా పోయాయి. ఆ స్థాయి వరద వచ్చింది

వైసిపి ఫ్యాన్ ఆపితే కానీ ప్రజల కష్టాలు తీరవు.

గాలికొచ్చి గాలికి కొట్టుకుపోయే పార్టీ వైకాపా

పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్ ఫెలో జగన్ రెడ్డి

టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం.

Comments