నేడు క్షేత్రస్థాయి లో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అమలు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


అర్హత ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా  సంక్షేమ పథకాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి  గారు ప్రతిష్టాత్మకంగా " గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.


సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం,  మనుబోలు మండలం, వీరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండుపాలెంలో జరిగిన   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని, ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న   సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ఆ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా  తెలుసుకుంటూ, ఏమైన సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలుపుతూ,   వారు పొందుతున్న పధకాల  లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.  పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డికి  అపూర్వ  స్వాగతం పలికారు.

ఈ సంధర్బంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గడచిన 3 సంవత్సరాల కాలంలో నెరవేరుస్తూ, ఆ హామీలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుచున్నవో  తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా క్షేత్రస్థాయిలో వివిధ సమస్యలపై అనేక అర్జీలు వచ్చేవని, నేడు క్షేత్రస్థాయి లో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అమలు


చేస్తూ గ్రామంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించబడం తో నేడు గ్రామ స్థాయిలో ప్రజలు ప్రభుత్వ పధకాల అమలు, అభివృద్ది పై ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.  రానున్న రోజుల్లో గ్రామాల్లో నెలకొనివున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి  వాటిని సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ  వెంకటేశ్వర్లు, తాహసిల్దార్  శ్రీ నాగరాజు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మండల  అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు  పాల్గొన్నారు.


Comments