తెలుగు భాషకు ఎందరో మహానుభావులు ఎంతో ప్రాచుర్యం కల్పించారు

 

మంగళగిరి (ప్రజా అమరావతి);


*సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము*:


*రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరిన శ్రీమతి ద్రౌపది ముర్ము*.


*సమావేశంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.విజయసాయిరెడ్డి*:


*శ్రీమతి ద్రౌపది ముర్ము. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి*:


– ‘ఆం«ధ్ర ప్రజలకు నా నమస్కారాలు’.. అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన శ్రీమతి ముర్ము.


రాష్ట్రంలో ఎందరో మహానుభావులు కవులు, స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డితో పాటు, ఇక్కడికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంకా నా సోదర సోదరీమణులందరికీ స్వాగతం పలుకుతున్నాను.

తెలుగు భాషకు ఎందరో మహానుభావులు ఎంతో ప్రాచుర్యం కల్పించారు


. వారిలో కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ.. వారందరినీ స్మరించుకుంటున్నాను. అలాగే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, ఇంకా వల్లడ నరసింహరాజు, ఎన్టీ రామారావుకు నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారంతా గొప్ప నాయకులు.

ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. పల్లవులు, చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు పాలించారు. విజయనగరం సామ్రాజ్యానిది గొప్ప చరిత్ర. అంతర్జాతీయ స్థాయిలో ఆ పాలనకు పేరు పొందింది. అనేక దేశాలతో అక్కడి పాలకులకు సత్సంబంధాలు కొనసాయాయి. భాష, సాహిత్యం, సంస్కృతికి రాష్ట్రం ఎంతో పేరు పొందింది. 

తెలుగు ఒక శాస్త్రీయ భాష కాగా, ఇక్కడ కూచిపూడి శాస్త్రీయ నృత్యం. రెండూ ఎంతో పేరు పొందాయి. అదే విధంగా పుణ్యక్షేత్రాలు, కళలు, సాంస్కృతిక కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్‌ పేరు పొందింది. ఇక్కడ తిరుపతి, లేపాక్షి వంటి క్షేత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ పూతరేకులు, ఖాజాలు ఎంతో ప్రసిద్ధి. ఉప్పాడ, కలంకారీ వస్త్రాలు. తోలు బొమ్మలాట. దుర్గి శిల్పకళ. ఏటికొప్పాక బొమ్మలు. ఇలా ఎన్నెన్నో.

స్వాతంత్య్ర సమరంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ కీలకపాత్ర పోషించింది. ఇక్కడి రాయలసీమలో ఉద్యమాలు. సహాయ నిరాకరణ చేస్తూ సాగిన చీరాల పేరాల ఉద్యమం. అల్లూరి నేతృత్వంలో జరిగిన రంప తిరుగుబాటు. సైమన్‌ గో బ్యాక్, సహాయ నిరాకరణ ఉద్యమం, సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం. అన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌ చురుగ్గా పాలు పంచుకుంది.

ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా, ఇక్కడి ప్రజలు చాలా కష్టపడతారు. ఇక్కడ పండించిన బియ్యం, మత్స్య సంపదకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంతో డిమాండ్‌ ఉంది. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు కూడా ఎంతో పేరు పొందాయి. అరకు లోయ. బొర్రా గుహల వంటి పర్యాటక ప్రాంతాలు, తిరుపతి వంటి తీర్ధయాత్ర కేంద్రాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఆ«ధ్యాత్మికంగానే కాకుండా, పర్యాటకంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది.

ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఎన్నో రంగాలలో ఎంతో పురోగతి సాధించింది. మన దేశం పట్ల విదేశాల్లో మరింత గౌరవం పెరిగింది. మన పట్ల వారి దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా మనందరం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రానున్న 25 ఏళ్లలో దేశం అన్ని రంగాలలో ఇంకా ఎంతో పురోగమించేలా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రత్యేకంగా రోడ్‌మ్యాప్‌ రూపొందించారు. అందరి భాగస్వామ్యం, సహకారంతో దాన్ని సాకారం చేయాలని ఆయన సంకల్పించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధికంగా వికాసం చెందిన దేశంగా భారత్‌ను తీర్చి దిద్దడంలో మనమంతా భాగస్వాములం కావాల్సి ఉంది. 

ప్రియమైన నా సోదర సోదరీమణులారా. నేనొక ఆదివాసీ మహిళను. ఒడిసాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామానికి చెందిన దాన్ని. ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రెండూ ఇరుగు పొరుగు రాష్ట్రాలు. అందుకే ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లలో రెండు రాష్ట్రాల మధ్య ఎంతో సామీప్యత ఉంది. దేశంలోని ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్‌ తెగకు చెందిన దాన్ని. ఇప్పుడు రాష్ట్రపతిగా నా అభ్యర్థిత్వం సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు ఒక నిదర్శనం. 

ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో మీ సోదరిని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశంలోనే అత్యున్నత పదవికి మీ సోదరిని ఎన్నుకోమని మరోసారి కోరుతున్నాను. 

నన్ను సమర్థించమని నేను కోరక ముందే, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, నన్ను హృదయపూర్వకంగా బలపర్చారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.

జైహింద్‌. జై ఆంధ్రప్రదేశ్‌. వందే మాతరం.

Comments